కుర్రాడి బండి మైలేజీ  ఎక్కువండీ
close
Updated : 21/09/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుర్రాడి బండి మైలేజీ  ఎక్కువండీ

ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన రాకేశ్‌

ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే

తాను తయారు చేసిన ఎలక్ట్రిక్‌ బైకుతో రాకేశ్‌

నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ద్విచక్రవాహనం కనీస అవసరమైంది. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు హడలెత్తిస్తున్నాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్‌ బైకుల వైపు చూస్తున్నారు. వీటిని గమనించిన ఖమ్మం కుర్రోడు స్వయంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం తయారు చేశారు. దీనిని ఒకసారి రీఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు మైలేజీ వచ్చే బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఖమ్మం నగరం శ్రీనివాసనగర్‌కు చెందిన గార్లపాటి రాకేశ్‌ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి ప్రకాశ్‌ టైలర్‌, తల్లి దేవమణి గృహిణి. ఖమ్మంలోని కిట్స్‌ కళాశాలలో బి.టెక్‌ మెకానికల్‌ విభాగంలో చదివారు. 2019లో తన డిగ్రీ పట్టా పొందారు. మొదటి నుంచి బైక్‌లపై ఆసక్తి ఉన్న రాకేశ్‌ బి.టెక్‌లో ఉండగా కళాశాల పరిశోధన విభాగం సాయంతో తన మిత్రులతో కలిసి ఎక్కువ సేపు నడిచే బ్యాటరీలను తయారు చేశారు. ఇటీవల జేఎన్‌టీయూ పరిధిలో వారి ప్రాజెక్టు ఎంపికైంది. ప్రముఖుల ప్రశంసలు సైతం పొందింది.


యారీ ఖర్చు

యాంత్రిక శక్తిని విద్యుత్తు శక్తిగా మార్చే ప్రక్రియతో బ్యాటరీల సామర్థ్యం పెంచారు. కంపెనీ బ్యాటరీకి తాను తయారు చేసిన కొన్ని డైనమోలు అమర్చారు. వాటిని ముందు చక్రంతో అనుసంధానం చేశారు. వాహనం నడుస్తుండగా డైనమోలు ఛార్జింగ్‌ అయి బ్యాటరీల సామర్థ్యం పెరుగుతుంది. దీంతో వాహనం మరింత దూరం వెళ్తుంది. ఈ మొత్తం తయారీకి వాహనం డిజైన్‌ను బట్టి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని రాకేశ్‌ చెబుతున్నారు. భవిష్యత్తులో బైక్‌ తయారీలో ఆసక్తి ఉన్న యువకులను తీసుకుని ఖమ్మంలోనే గ్యారేజీ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.


ఇవీ ప్రత్యేకతలు

అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీలను ప్రత్యేకంగా తెప్పించి ద్విచక్రవాహనానికి అనుసంధానిస్తారు. బ్యాటరీ పవర్‌తో వాహనం 200 కి.మీ. వరకు నడుస్తుంది. డైనమోలు అనుసంధానించటంతో బ్యాటరీ సామర్థ్యం 50 శాతం పెరిగి 300 కి.మీ. వరకు వస్తుంది. బ్రేక్‌ వేసినప్పుడు కూడా బ్యాటరీ రీఛార్జి కావడం దీని ప్రత్యేకత. రాకేశ్‌ తయారు చేసే ద్విచక్ర వాహనానికి జీపీఎస్‌తో మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఉంది. మొబైల్‌తో బైక్‌ను కంట్రోల్‌ చేయవచ్ఛు తమ మొబైల్‌లో వాహనం బ్యాటరీలో పవర్‌ ఎంత ఉంది? ఇంకా ఎంత దూరం వస్తుంది అనేది తెలుసుకోవచ్ఛు చరవాణితోనే వాహనాన్ని స్టార్ట్‌ చేయవచ్ఛు స్టాప్‌ చేయవచ్ఛు


సొంతంగా బైకు తయారీ

కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు కొన్ని కంపెనీలల్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఖమ్మంలోనే ఉండి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. పలు ద్విచక్రవాహనాల విడిభాగాలతో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. దానికి కంపెనీ బ్యాటరీ అమర్చారు. తన పరిశోధనతో ఒకసారి రీఛార్జి చేస్తే 200 కి.మీ.లు వెళ్లే విధంగా తయారు చేశారు. ప్రయోగాత్మకంగా కొద్దిరోజులుగా నడుపుతున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని