వరద వ్యధ
close
Published : 21/09/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరద వ్యధ

 నాలుగు అడుగుల నీటిలో.. వేలాది మంది జీవనం 


 కొణస సమితిలోని డొకుండలో ఇదీ పరిస్థితి 

భువనేశ్వర్‌ అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మహానదిలో నీటిమట్టం పెరగడంతో జిల్లాలో ఉపనదులైన లూనా, కుశభద్ర, రత్నచీర, దయ, భార్గవి నదుల్లో ప్రవాహం పెరిగింది. వరద నీరు ప్రవేశించడంతో గోప, కాకట్‌పూర్, కొణసలోని పలు గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. గ్రామాల్లో నాలుగు అడుగుల మేర నీరు ఉండిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొణస సమితిలోని డొకుండ గ్రామాన్ని సోమవారం ఈటీవీ భారత్‌ ప్రతినిధి సందర్శించారు. గ్రామ ప్రజలతో మాట్లాడారు. నాలుగు రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గాయి, నీరు సైతం ఇంకిపోయింది అనుకున్నంతలో వరద నీరు ప్రవేశించడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో కొంత మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లారని తెలిపారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే నీటిలోనే నడిచి వెళ్లాలని వాపోయారు. భోజనం, మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్థానిక నేతలు, అధికారులు కనిపించడం లేదని, పంటలు నీట మునిగాయన్నారు. సమితిలో అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గోవులను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని, వాటిని ఎత్తయిన ప్రాంతాలకు తరలించామన్నారు. గ్రామాల నుంచి నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


మోకాలి లోతు నీటిలోనే గ్రామస్థుల రాకపోకలు


ఇంటి బయట దీనంగా బాలుడు 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని