తన క్రీడాకారుల్లో గోపీచంద్‌కు ఎవరంటే ఇష్టం?
close
Updated : 04/01/2020 22:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన క్రీడాకారుల్లో గోపీచంద్‌కు ఎవరంటే ఇష్టం?

‘చెప్పాలని ఉంది’లో బ్యాడ్మింటన్‌ కోచ్‌ ఆసక్తికర సమాధానాలు

హైదరాబాద్‌: ప్రముఖ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌‌, బ్యాడ్మింటన్‌ ఈ రెండూ ఒక నాణేనికి రెండు వైపులు. ప్రకాశ్‌ పదుకొణె ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ గెలుచుకున్న తర్వాత ఆ పురస్కారాన్ని గోపీచందే గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన క్రీడాకారుడిగా తన ఇన్నింగ్స్‌ ముగించి కోచ్‌ అవతారంలో అనేకమంది వర్ధమాన క్రీడాకారులను బ్యాడ్మింటన్‌కు అందించారు. ఈ క్రమంలో ఆయన పొందిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు. 1999లో అర్జున, ఆ మరుసటి ఏడాది రాజీవ్‌ ఖేల్‌ రత్న, 2005లో పద్మశ్రీ, 2009న ద్రోణాచార్య, 2014లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.  2019 జూన్‌లో ఐఐటీ కాన్పూర్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తన అకాడమీ నుంచి పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌ వంటి స్టార్‌ క్రీడా ఆణిముత్యాలను అందించిన గోపీచంద్‌ ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో అనేక విశేషాలను పంచుకున్నారు. 

తాజాగా ఈనాడు సంస్థ నిర్వహిస్తోన్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ (ఈఎస్‌ఎల్‌)కు  బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రపంచంలో క్రీడా సంబంధమైన అంశాలతో పాటు తన శిక్షణా సంస్థ ఆవిర్భావం, క్రీడల ఆవశ్యకత తదితర అనేక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాకుండా తన వ్యక్తిగత విశేషాలనూ పంచుకున్నారు. తనకు ఇష్టమైన హీరో, ఇష్టంగా తినే ఆహారం, నచ్చిన ప్రదేశం,  తన ప్లేయర్లలో బాగా ఇష్టమైన వారెవరు? తదితర ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలన్నింటినీ ఈ వీడియోలో చూడండి.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని