జీమెయిల్‌ నుంచే కాల్‌
close
Published : 15/09/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీమెయిల్‌ నుంచే కాల్‌

జీమెయిల్‌ వాడేవారికి శుభవార్త. ఇకపై నేరుగా ఇన్‌బాక్స్‌ నుంచే మొబైల్‌ ఫోన్‌ కాల్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌ చేయొద్దనుకుంటే నేరుగా అవతలివారి ఫోన్‌కు మెసేజ్‌ కూడా పంపించొచ్చు. బృంద చర్చల్లోనూ పాల్గొనొచ్చు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీమెయిల్‌ త్వరలోనే ఇలాంటి భారీ మార్పులు చేయనుంది. వీటిల్లో ముఖ్యమైంది నేరుగా ఇన్‌బాక్స్‌ నుంచే కాల్‌ చేయటం. ఫోన్‌ నంబరు కోసం కాంటాక్ట్‌ జాబితాను వెతకాల్సిన అవసరం లేదు. మరో యాప్‌ను తెరవాల్సిన పని లేదు. గూగుల్‌ యూజర్‌ ఈమెయిల్‌ చిరునామా నుంచి వెంటనే కాల్‌ చేయొచ్చు. వెబ్‌సైట్‌ లేదా యాప్‌ నుంచి బయటకు రాకుండానే వీటన్నింటినీ చేసుకోవచ్చు. ఈమెయిల్‌ పంపాల్సిన అవసరం లేకుండా ఛాట్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేసి కాంటాక్ట్‌కు మెసేజ్‌ పంపించొచ్చు. ఒకరకంగా ఈమెయిల్‌ పంపించాల్సిన అవసరం లేకుండానే పనులు చేసుకోవచ్చన్నమాట. ఈ మెసేజ్‌లు జీమెయిల్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారి ఫోన్లు, ట్యాబెట్ల వంటి ఇతర పరికరాల్లోనూ కనిపిస్తాయి. ఒకసారి జీమెయిల్‌ వర్క్‌స్పేస్‌ అప్‌డేట్‌ కాగానే నేరుగా కాల్‌ చేసుకునే, మెసేజ్‌లు పంపించే సదుపాయాలతో పాటు స్పేసెస్‌ కూడా అందుబాటులోకి రానుంది గూగుల్‌ ఛాట్‌, మీట్‌ అందరికీ తెలిసినవే గానీ గూగుల్‌ స్పేసెస్‌ అంత పరిచితం కాదు. ఇది బృంద చర్చలకు వీలు కల్పిస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని