కొమ్ముల మొసలి గుట్టు రట్టు
close
Updated : 02/06/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొమ్ముల మొసలి గుట్టు రట్టు

అంతరించిపోయిన కొమ్ముల మొసలి మీద చాలాకాలంగా నెలకొన్న వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ పరిశోధకులు దీన్ని సాధించారు. ఇది మామూలు మొసళ్లకు అతి సన్నిహితమైందని జన్యు విశ్లేషణలో బయటపడింది. పిరమిడ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో కొమ్ముల మొసలి మడగాస్కర్‌ ద్వీపంలో దాగుందని భావిస్తున్నారు. దాదాపు 150 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా, దీని మూలాల వివాదాలు అలాగే ఉన్నాయి. దీన్ని 1870లో తొలిసారి మొసళ్ల వంశంలో కొత్త సంతతిగా అభివర్ణించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని పురాతన నైల్‌ మొసలిగా విశ్లేషించారు. చివరిసారి శిలాజ నమూనాల భౌతిక లక్షణాలు అధ్యయనం చేసి, ఇది మామూలు మొసలి కాదని, మరుగుజ్జు మొసళ్లతో కూడిన సమూహంలో ఒకటని తీర్మానించారు. ఇన్నాళ్లకి తాజా అధ్యయనంతో దీని అసలు మూలాలు దొరికినట్టయ్యింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని