ధ్రువ ప్రభల గుట్టు అదే
close
Updated : 18/08/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధ్రువ ప్రభల గుట్టు అదే

ధ్రువాల వద్ద రాత్రిపూట ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అలరారటం తెలిసిందే. వీటినే ధ్రువ ప్రభలు (ఆరోరా) అంటారు. వీటి గుట్టును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతరిక్షం నుంచి వచ్చే ఎలక్ట్రాన్ల తరంగాలు పై వాతావరణంలో భూ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించి.. ఆక్సిజన్‌, నత్రజని మూలకాలతో ఢీకొట్టటం వల్ల ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్రకాశిస్తూ కనిపిస్తుందని చాలాకాలంగా ఊహిస్తున్నారు. కానీ ఉపగ్రహాలేవీ దీన్ని గుర్తించలేకపోయాయి. అందుకే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అచ్చం అంతరిక్షంలోని పరిస్థితులనే సృష్టించి పరీక్షించారు. ప్లాస్మాతో నిండిన గొట్టంలోకి అయస్కాంత క్షేత్ర తరంగాలను పంపించి పరిశీలించారు. ఇవి ప్లాస్మాలోని ఎలక్ట్రాన్లను ప్రేరేపించి.. ధ్రువ ప్రభలు ఏర్పడటానికి అవసరమైన పరిస్థితులనే సృష్టించటం విశేషం. దీంతో ధ్రువ ప్రభల గుట్టు వీడినట్టయ్యింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని