విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌
close
Published : 08/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌

ఠాత్తుగా విద్యుత్తు అంతరాయం కలగకుండా ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు కొత్త పద్ధతిని రూపొందించారు. విద్యుత్‌ పంపిణీ అనుసంధానాల్లో పోగుపడే కాలుష్యం మోతాదులను తేలికగా గుర్తించటం దీనిలోని కీలకాంశం. విద్యుత్‌ వ్యవస్థల పనితీరు చాలావరకు ఎలక్ట్రికల్‌ ఇన్సులేషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆరుబయట విద్యుత్‌ తీగలు, సబ్‌స్టేషన్‌ పరికరాల ఇన్సులేషన్‌ మీద  ఎలక్ట్రికల్‌, థర్మల్‌, మెకానికల్‌ ఒత్తిళ్లతో పాటు పర్యావరణ కాలుష్యమూ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కాలుష్యం పెరిగితే అక్కడ మంటలు లేచి విద్యుత్‌ అంతరాయానికి దారితీస్తుంది. కాలుష్యాన్ని శుభ్రం చేయటం ఒక్కటే దీనికి పరిష్కారం. అందుకే దీన్ని ముందుగానే గుర్తించే ప్రక్రియకు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు శ్రీకారం చుట్టారు. ఇది ఇన్సులేటర్‌పై లేజర్‌ కాంతిని ప్రసరింపజేసి, దాని సాయంతో కాలుష్యం స్థాయులను గుర్తిస్తుంది. దీంతో 40 మీటర్ల దూరం నుంచే కాలుష్యం స్థాయిలను తెలుసుకోవచ్చు. మున్ముందు దీని సామర్థ్యాన్ని 100 మీటర్ల వరకూ పెంచాలని భావిస్తున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉంటే వెంటనే శుభ్రం చేయటానికి వీలుంటుంది. ఇలా విద్యుత్‌ అంతరాయాన్ని ముందే నివారించొచ్చు. ‘‘ఇది చాలా తేలికైంది. సత్వరం కచ్చితమైన ఫలితాన్ని చెబుతుంది. అతి తక్కువ వ్యవధిలోనే మొత్తం విద్యుత్‌ లైన్‌ను సమర్థంగా పర్యవేక్షించొచ్చు. కాలుష్యం మోతాదులను పసిగట్టొచ్చు’’ అని పరిశోధకులు చెబుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని