చేతుల కింద నలుపు తగ్గిద్దాం!
close
Published : 26/07/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతుల కింద నలుపు తగ్గిద్దాం!

కొందరమ్మాయిలను చేతుల కింద నలుపుదనం ఇబ్బందిపెడుతుంది. దాంతో పొట్టిచేతుల బ్లవుజులు, స్లీవ్‌లెస్‌ టాపులు వేసుకోలేకపోతున్నాం అని తెగ ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, చిట్కాలు పాటిస్తే ఈ సమస్య దూరమవుతుంది.

రోజూ స్నానానికి వెళ్లే ముందు అరచెక్క నిమ్మచెక్కకు కాస్త పంచదార అద్ది...ఆ ప్రదేశంలో రుద్దండి. ఇలా చేయడంవల్ల నిమ్మలోని సహజ బ్లీచింగ్‌ ఏజెంట్లు చర్మం ఛాయను మెరుగుపరుస్తాయి.

* కాలం ఏదైనా రోజూ మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మానొద్దు. అలానే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి త్రెడ్డింగ్‌, షేవింగ్‌...లాంటివి కాకుండా వ్యాక్సింగ్‌ని ప్రయత్నిస్తే సమస్య కొంతవరకూ అదుపులో ఉంటుంది.

* సమాన పరిమాణంలో ఆలివ్‌ నూనె, బ్రౌన్‌ షుగర్‌, చెంచా నిమ్మరసం కలిపి అక్కడి చర్మంపై ప్యాక్‌ వేయండి. కాసేపాగి చల్లటి నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే...పరిష్కారం కనిపిస్తుంది.

* రెండు టేబుల్‌ స్పూన్ల ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో చెంచా వంటసోడా కలిపి బాహుమూలల్లో, మోచేతులు, మెడ మీద రాస్తే...నల్లని చర్మం రంగు మారుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని