కళ్లకింద క్యారీ బాగులా!
close
Updated : 27/07/2021 06:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళ్లకింద క్యారీ బాగులా!

కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలు రావడానికి బోలెడు కారణాలు. అందులో నిద్రలేమి కూడా ఒకటి. మరో కొత్త సంగతి ఏమిటంటే అతినిద్ర వల్లా ఇవి వస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దామా...

ఎలా వస్తాయంటే...

* పోషకాహారం తీసుకోకపోవడం, అతినిద్ర, అలసట, టీవీ, కంప్యూటర్‌ల ముందు గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మొబైల్‌ చూడటం.. వీటన్నింటి వల్ల చర్మ కణజాలం, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయి.

* హైపర్‌ పిగ్మెంటేషన్‌ వల్ల కూడా అలర్జీ, కళ్లు పొడిబారడం లాంటి సమస్యలు రావొచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో  మెలనిన్‌ వర్ణకం స్రావం ఎక్కువవడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇది హైపర్‌ పిగ్మెంటేషన్‌కు దారి తీస్తుంది.  కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖాన్ని ఎండ తగలకుండా టోపీ పెట్టుకోవడమో, చున్నీ కట్టుకోవడమో చేయాలి. అలాగే ఎస్‌పీఎఫ్‌30 సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మరిచిపోవద్దు.

కళ్లను రక్షించుకోండిలా...

* నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులనే వాడాలి.

* కంటినిండా నిద్రపోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. విటమిన్‌-కె ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

* కంటికింద నూనెగ్రంథులేవీ ఉండవు. పైగా ఆ ప్రాంతం చాలా సున్నితం కాబట్టి మేకప్‌ తీసేటప్పుడు అక్కడ గట్టిగా రుద్దకూడదు. 

* రోజులో అయిదారు సార్లు కంటికి చిన్నపాటి మసాజ్‌ చేసుకోవాలి.

తగ్గించుకునేందుకు చిట్కాలు...

* రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి/ ఆముదం/ బాదం నూనెతో కంటి కింద మృదువుగా మర్దనా చేసుకోవాలి.

* చర్మ తత్వానికి సరిపోయే నైట్‌ ఐ క్రీమ్‌ను రాసుకోవాలి.

* అరటిపండు తొక్కతో కంటికింద మృదువుగా రాయడం వల్ల అక్కడి నలుపుదనం తగ్గుతుంది.

* నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యిని కళ్లకింద మృదువుగా రాస్తే సరి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని