కళ్లకీ కావాలో విరామం
close
Updated : 29/08/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళ్లకీ కావాలో విరామం

పిల్లలతోపాటు ఆన్‌లైన్‌ తరగతుల్లో కూర్చోవడం, ప్రతిదానికీ మొబైల్‌పై ఆధారపడటం వెరసి గృహిణులకూ స్క్రీన్‌ వాడకం పెరిగిపోయింది. మరి కళ్ల ఆరోగ్యం సంగతేంటి?

లాక్‌డౌన్‌ తర్వాత స్క్రీన్‌పై ఆధారపడుతున్న మహిళల శాతం గణనీయంగా పెరిగిందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పెరిగిన పనికితోడు దీని ప్రభావమూ తోడై తలనొప్పి, అసహనం వంటివి పెరుగుతున్నాయట. కాబట్టి.. కళ్ల పరిరక్షణపై దృష్టిపెట్టాలంటున్నారు నిపుణులు.

సాధారణంగా నిమిషానికి 12 నుంచి 18 సార్లు కళ్లు ఆర్పుతాం. స్క్రీన్‌ను చూసేటపుడు ఆ విషయాన్ని మర్చిపోతామట. దీనివల్ల కళ్లకు అందే సాధారణ తేమ తగ్గి, అవి పొడిబారుతాయి. దీంతో కళ్లు ఎర్రబారడం, తలనొప్పి. గ్యాడ్జెట్ల నుంచి వచ్చే వేడి కూడా కళ్లలోని తేమను ఆవిరి చేస్తాయి. కాబట్టి దీన్ని గమనించుకుంటూ ఉండాలి. ప్రతి అరగంటకోసారి కళ్లు ఆర్పడం ఓ పనిలా పెట్టుకోవాలి. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను కనీసం చేయి దూరంలో ఉంచాలి. సినిమా లాంటివి చూడాలనుకుంటే మొబైల్‌, ల్యాప్‌టాప్‌ల కంటే టీవీని ఎంచుకోవడం మేలు. యాంటీ గ్లేర్‌, బ్లూ గ్లాసెస్‌ వంటివి కొంత మేలు చేస్తాయి. వాటిని పెట్టుకున్నా ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్‌ నుంచి పక్కకు చూడటం చేయాలి. కళ్లకీ చిన్న చిన్న విరామాలను ఇవ్వాలి.అలాగే కళ్ల మీద ప్రయోగాలొద్దు. దురద, మంట లాంటివి ఉన్నప్పుడు కీరా, తడి గుడ్డలను పెట్టొద్దు. ఇన్ఫెక్షన్‌కు దారి తీయొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని