చాక్లెట్‌ తెచ్చే అందమిది
close
Updated : 16/09/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాక్లెట్‌ తెచ్చే అందమిది

తియ్యని చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారెవరు! అయితే దీన్ని కేవలం తినడానికే కాదు... సౌందర్యపోషణకూ వినియోగించొచ్చు తెలుసా?

ముందుగా చాక్లెట్‌ని కరిగించాలి. దానిలో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, కాస్త నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పూత వేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో జిడ్డు తొలగి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

* పావుకప్పు చాక్లెట్‌లో చెంచా తేనె, నాలుగు చెంచాల ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి....ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.

* ముఖం నిర్జీవంగా ఉన్నప్పుడు రెండు టేబుల్‌ స్పూన్ల కరిగించిన చాక్లెట్‌లో చెంచా బాదం పేస్టు, కాస్త ఆలివ్‌ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని....ముఖానికి రాసుకోవాలి. పావుగంట ఆరనిచ్చి వేళ్లను నీళ్లతో తడుపుతూ మర్దన చేయాలి. దీనివల్ల చర్మం శుభ్రపడుతుంది. కాంతిమంతంగా మెరిసిపోతుంది.

* సరైన పోషణ లేక కొన్నిసార్లు ముఖంపై ముడతలు పడి అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తాం. ఇలాంటప్పుడు చాక్లెట్‌ ద్రవంలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదారు చుక్కల రోజ్‌ ఆయిల్‌ కలిపి బాగా గిలకొట్టండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే సమస్య దూరమవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని