ఆలూతో అందం...
close
Updated : 21/09/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలూతో అందం...

అందుబాటులో ఉండే ఆలుగడ్డని అందానికీ ఉపయోగించొచ్చని మీకు తెలుసా? అదెలాగంటే...

చిన్న వయసులోనే ముఖం మీద వృద్ధాప్య ఛాయలు కనిపిస్తే....ఇలా చేయండి. బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేయాలి. తరచూ చేస్తుంటే...ఇందులోని యాంటీ ఏజింగ్‌ గుణాలు అలసిన చర్మానికి సాంత్వన అందిస్తాయి. ముడతలు, నల్లమచ్చల్ని తగ్గిస్తాయి.

* ట్యాన్‌ వదిలించుకోవాలంటే... బంగాళాదుంప రసంలో చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసి ఆరనివ్వాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే నలుపు తగ్గుతుంది. చర్మానికి తేమ అందుతుంది.

* కొందరికి ఎండ వల్ల చర్మం కంది.. ఎర్రగా మారుతుంది. అలాంటప్పుడు.. గుండ్రంగా సన్నగా తరిగిన ముక్కల్ని తీసుకుని డీప్‌ ఫ్రిజ్‌లోపెట్టాలి. అరగంటయ్యాక తీసుకుని.. కందిన చోట ఆ  ముక్కల్ని ఉంచితే కూలింగ్‌ ఎఫెక్ట్‌ అందుతుంది. ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.

* బంగాళాదుంప రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని.. ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. లేదంటే రెండుచెంచాల బంగాళాదుంప గుజ్జులో కీరదోస రసం, కొద్దిగా తేనె కలిపి.. ముఖానికి మర్దన చేసుకున్నాక పూతలా వేసుకోవాలి. ఈ రెండు ప్యాక్‌ల్లో ఏది వేసుకున్నా...ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మానికి తేమ అందుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని