ఇంట్లోనే బ్లీచ్‌!
close
Updated : 23/09/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోనే బ్లీచ్‌!

కాలంతో పనిలేకుండా కాలుష్యం, ఇతరత్రా కారణాలు చర్మంపై టాన్‌ పేరుకునేలా చేస్తాయి. దీన్ని వంటింటి వస్తువులతోనూ పోగొట్టుకోవచ్చు. అందుకోసం...

నిమ్మరసం సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌. గులాబీ నీళ్లు, కీరదోసలు కూలింగ్‌ కారకాలు. ఈ మూడింటినీ సమాన పరిమాణంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముంచిన దూదితో టాన్‌ ఉండే చోట రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా బయట నుంచి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే చేస్తుంటే క్రమంగా నలుపు తగ్గుతుంది.

* రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగులో, చిటికెడు పసుపు, చెంచా బాదం పేస్ట్‌, టేబుల్‌ స్పూన్‌ కమలాఫలం రసం, కొద్దిగా గులాబీనీళ్లు వేసుకుని బాగా కలపండి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. నలుపు తగ్గి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

* ఓట్‌మీల్‌ పావుకప్పు తీసుకుని మజ్జిగలో నానబెట్టాలి. దాన్ని ముఖం, మెడ, మోచేతులకు రాసుకుని సవ్య, అపసవ్య దిశల్లో రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది. ముఖానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని