గర్భిణులకు ‘మాతృకవచం’ - 109
close
Updated : 17/07/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గర్భిణులకు ‘మాతృకవచం’ - 109

మహిళల సంరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్న కేరళలో గర్భిణుల కోసం కొత్త పథకం రూపుదాల్చింది. ‘మాతృకవచం’ పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఓ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గర్భిణులందరూ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ సహాయంగా ఆశా వర్కర్లను నియమించింది. మామూలు వ్యాక్సిన్‌ కేంద్రాల్లో గర్భిణులు గంటల తరబడి నిలబడి ఉండటం సురక్షితం కాదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ఏడాది కేరళలో కొవిడ్‌ సోకిన చాలా మంది గర్భిణులకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు వచ్చాయి. కొందరిలో వైరస్‌ ప్రభావం తీవ్రమై ప్రమాదకర స్థితికి చేరుకున్నారు. మరికొందరిలో ఆ ప్రభావం కడుపులోని బిడ్డపై కూడా పడింది. వీటన్నింటినీ నివారించడానికే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే లోపు రెండు విడతలుగా వ్యాక్సిన్‌ను వేయించుకోవడం అత్యవసరమని, ఇతర కొవిడ్‌ జాగ్రత్తలనూ ఈ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని