చిన్నారులకు పొదుపు నేర్పండి!
close
Updated : 17/03/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారులకు పొదుపు నేర్పండి!

అతి వల్ల అనర్థాలు జరుగుతా యంటారు. అది డబ్బు విషయంలో అక్షరాలా నిజమనిపిస్తుంది. అవసరమైన దానికంటే డబ్బును నీళ్లలా ఖర్చుపెడితే కష్టాల సమయంలో రూపాయి కూడా చేతిలో ఉండదు. కాబట్టి తల్లిదండ్రులూ డబ్బును జాగ్రత్తగా వాడుతూ దాన్ని పొదుపు చేయడమెలాగో ఇప్పటి నుంచే చిన్నారులకు నేర్పాలి.అందుకు ఏం చేయాలంటే...
పాకెట్‌ మనీ దాచుకునేలా..
చిన్నప్పటి నుంచి పిల్లలకు పొదుపు చేయడం నేర్పాలి. ఇందుకోసం ప్రతి నెలా వారికి కొంత నగదును ఇవ్వండి. ఆ మొత్తం దాచుకోవడానికి ఓ చక్కటి డబ్బుల డిబ్బీ కొనిపెట్టండి. ఇచ్చిన డబ్బు ఖర్చు చేయకుండా కొద్దికొద్దిగా దాంట్లో దాచుకోమనండి. ఈ నగదును వారి పేరిట బ్యాంకులో ఖాతా తెరిచి వారితోనే అందులో వేయించండి. ఇలా చేయిస్తే డబ్బు విలువ చిన్నప్పటి నుంచే అర్థమవుతుంది.
చిన్న లక్ష్యాలతో మొదలు...
మొదట చిన్నారిని కూర్చొబెట్టి పొదుపు విలువను తెలియజేయండి. తనకిచ్చే మొత్తాన్ని దాచుకోమనండి. అది కాస్త పెద్ద మొత్తం అయ్యాక దాంతో తనకు నచ్చిన వస్తువును కొనుక్కోవచ్చని చెప్పండి. చిన్నారి నిర్ణయం తీసుకోలేకపోతే తనకు నచ్చిన వస్తువును కాస్త ధర ఎక్కువైనా మీరు కొంత కలిపి కొనిపెట్టండి. పొదుపు చేయడం వల్ల అమ్మానాన్నలు తనకు అవసరమైనప్పుడు సాయం చేస్తారనే విషయం చిన్నారికి తెలుస్తుంది.
ఇంటి లెక్కలూ చెప్పండి...
కొంచెం పెద్ద పిల్లలైతే ఇంటి ఖర్చు వారికి తెలిసేలా చేయండి. మీ నెలవారీ సరకుల కోసం  వెళ్లే సమయంలో తనని మీ వెంట తీసుకువెళ్లండి. దేనికెంత ఖర్చు అవుతోందో తనకూ  తెలుస్తుంది. అలాగే ఏదీ ఉచితంగా రాదని ప్రతిదీ కొనుగోలు చేయాలనీ, దానికి డబ్బు అవసరమన్న సంగతి అర్థమవుతుంది.
అవసరం లేనివి కొనొద్దు...
చాలామంది తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో అన్నీ కొనేస్తారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అవసరమైనవాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. మిమ్మల్ని చూసి పిల్లలూ నేర్చుకుంటారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని