దాంపత్యానికి దూరమవుతున్నారా..
close
Updated : 12/09/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాంపత్యానికి దూరమవుతున్నారా..

అధిక పనివేళలు, ఇంటికి చేరిన ఆఫీస్‌ విధులు... జీవితాన్ని యాంత్రికంగా మారుస్తున్నాయి.  ఇవన్నీ పలు శారీరక, మానసిక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని పరిష్కరించుకుని, నిండైన దాంపత్య జీవితం పొందడం కోసం మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే....

ఫీస్‌ పనిని పడకగదిలోకి తీసుకు రాకుండా ఉంటే మంచిది. సెల్‌, ల్యాప్‌టాప్‌ వంటి గ్యాడ్జెట్లనూ దూరంగా ఉంచాలి. లేదంటే ఇద్దరిలో ఒకరు ఫోన్‌లో బిజీగా ఉంటే, తమను నిర్లక్ష్యం చేస్తున్నట్లు రెండో వ్యక్తి భావించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అంశాలను రాత్రి సమయాల్లో చర్చకు తీసుకు రాకూడదు. ఆరోజు జరిగిన విశేషాలు లేదా ఇరువురికి సంబంధించిన అంశాలను చెప్పుకోవాలి. ఆ ఏకాంతాన్ని మీ కోసమే అన్నట్లుగా వినియోగించుకోవాలి. అది మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. ఆ సంభాషణ ఇద్దరినీ దగ్గర చేస్తుంది.

అలా వద్దు...

కొందరు సమయం సందర్భం లేకుండా ఎదుటి వారిని ఆక్షేపించడం, ఆరోపించడం చేస్తుంటారు. ఈ లక్షణాన్ని వీలైనంత త్వరగా గుర్తించి, తగ్గించుకుంటే మంచిది. లేదంటే అది ఇరువురి అనుబంధాన్ని దూరం చేస్తుంది. భాగస్వామిని నిందించడం కాకుండా, మనసులోని ఆలోచనను మృదువుగా చెప్పడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలనే పోట్లాటగా మార్చుకోకుండా, ఇద్దరూ కూర్చుని విశ్లేషించుకుంటే పరిష్కారం దొరుకుతుంది. 

ఆరోగ్యంగా

దాంపత్య జీవితానికి ఆరోగ్యం అతి ముఖ్యమైంది. సమయం ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి నడవడం లేదా అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడటం వంటివి ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో ఏ ఒడుదొడుకులు రావు. పడకగదిలో వార్తలు, రాజకీయ అంశాలపై వచ్చే చర్చలు కూడా ఒక్కొక్కసారి సమయాన్ని వృథా చేయడమే కాదు, విబేధాలకు కారణమవుతాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని