వాళ్లను ప్రేమించనివ్వండి!
close
Published : 21/09/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లను ప్రేమించనివ్వండి!

రమ్య తన పిల్లలు ఇంట్లో పెద్దవాళ్లని చులకనగా చూడటం గమనించింది. వాళ్లకు సాయం చేయకపోగా హేళన చేయడం చూసి బాధపడుతోంది. ఈ తరహా ప్రవర్తనను పిల్లల్లో పెరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు మానసిక నిపుణులు..

ఇంట్లో వృద్ధులకు, పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచాలంటే ముందుగా మనం పెద్దవాళ్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలను అమ్మానాన్నా ఎంతగా ప్రేమిస్తున్నారో పిల్లలు గమనిస్తూనే ఉంటారు. తల్లిదండ్రుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించినా వృద్ధులపట్ల తామూ  అలాగే ఉండటానికి ప్రయత్నిస్తారు. అదే సరైనదనే భావం వారి లేత మనసుల్లో పాతుకుపోతుంది. అలాకాకుండా తల్లిదండ్రులు పెద్దవాళ్లని గౌరవంగా చూస్తే, అదే స్ఫూర్తిగా తీసుకుంటారు. మర్యాదకు అర్థం తెలుసుకుంటారు. వారు కూడా పెద్దవారిని ప్రేమిస్తూ, వారిపట్ల అనుబంధాన్ని పెంచుకుంటారు.

దగ్గర చేయాలి

వృద్ధులకు పిల్లలను దగ్గర చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. నానమ్మ కథలు బాగా చెబుతుందని, తాతయ్య తన చిన్ననాటి జ్ఞాపకాలను చెబుతారని పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. అలాగే చదువులోనూ వారి సాయం తీసుకోవాలని ప్రోత్సహించాలి. పెద్దవాళ్లకు సాయం చేయడం నేర్పాలి. ఇవన్నీ పెద్దవాళ్లు, చిన్నారులకు మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేస్తాయి. ఇరువురూ విడదీయలేని స్నేహితులుగా మారిపోతారు. అలాగే వృద్ధుల్లో ఒంటరితనం దూరమవుతుంది. వారు పిల్లలకు బాల్యంలో తోడుగా మారతారు. వారి భయాలను దూరం చేసి, ధైర్యంగా ఉండేలా చేస్తారు.

విలువలు చెబుదాం...

పెద్దవాళ్ల నుంచి పిల్లలు కుటుంబ విలువలను బాల్యం నుంచే నేర్చు కోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య గౌరవం, ప్రేమ వంటి విషయాల్లో చిన్నారులు పెద్ద వాళ్లను అనుసరిస్తారు. చిన్నప్పుడే ఇతరులను మర్యాదగా చూడటం వంటివన్నీ వారితోపాటు పెరిగి, బయటి వారి పట్ల కూడా అలాగే నడుచుకోవడం అలవరుచుకుంటారు. ప్రతి బంధానికి ఉండే విలువను పిల్లలకు ఇంటి నుంచే తెలిసేలా చేయాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని