అనుబంధానికి ప్రణాళిక వేద్దాం!
close
Updated : 23/09/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుబంధానికి ప్రణాళిక వేద్దాం!

అవును వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది కానీ...మీ బంధంలోని లోపాలను సరిద్దుకోవడానికీ, చక్కటి సాంగత్యాన్ని, మధురస్మృతులనూ నింపుకోవడానికీ ఇది ఎంతో అవసరం.

ప్రణాళిక అనగానే సమీక్షలూ, లోటుపాట్ల అంచనాలూ ఉంటాయికదా.. వాటినీ బేరీజు వేసుకోవాలంటున్నారు నిపుణులు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు.. రోజూ మాట్లాడుకునే సమయం అంతగా లేనప్పుడు ఇదెంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగని మనస్పర్థలూ, గొడవలూ సున్నితమైన విషయాలే మాట్లాడుకోవాలని అనుకోకండి. మంచీ, చెడూ అన్నీ చర్చించుకోవాలి.

* గత ఏడురోజుల్లో మీకు ఆనందం కలిగించినవీ, నష్టం కలిగించినవీ, ఇంటికి సంబంధించి ఇద్దరూ వేర్వేరుగా తీసుకున్న బాధ్యతలూ, వాటిలో ఎదుర్కొన్న ఇబ్బందులూ, వచ్చేవారానికి మీరు చేయబోయే పనులు, వాటికి భాగస్వామి నుంచి కావాల్సిన సహకారం.. ఇలా ప్రతిదీ మాట్లాడుకోండి. ఇందుకో గంట కేటాయించండి. పనిలోపనిగా వచ్చేవారం చేయాల్సిన పనులనూ పక్కాగా రాసుకోండి.

* ప్రణాళిక అంటే...వాస్తవానికి అనుకున్నది అనుకున్నట్లు చేయాలి. కానీ బంధంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. అలాకాకుండా... పట్టిందే పట్టు అన్నట్లు ఉండకూడదు. అప్పుడే మీ ఇల్లు స్వర్గధామంలా సాగుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని