మురిపించే వామన వృక్షాలు...
close
Published : 14/07/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మురిపించే వామన వృక్షాలు...

నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోటా లాంటి చెట్లు చిన్న కుండీల్లో బోన్సాయ్‌గా ఒదిగిపోయి మనసును దోచేయడం తెలిసిందే. అలాంటి వామన వృక్షాల్ని పెంచేసుకోవాలని మీక్కూడా అనిపిస్తోందా? అదేం కష్టమైన విషయం కాదు. ఈ సూచనలు పాటిస్తే సరిపోతుంది...

ముందుగా బోన్సాయ్‌ మొక్కల్ని ఆరుబయటా లేక ఇండోర్‌ ప్లాంట్స్‌గా ఉంచాలనుకుంటున్నారా తేల్చుకుని ఆ వాతావరణానికి అనుకూలమైన వాటిని ఎంచుకోండి. సూర్యరశ్మి తగలదు, కొద్దిపాటి వేడే ఉంటుంది కనుక ఇంట్లో అన్నీ అనుకూలం కాదు.

* వీటిని నర్సరీలో కొనుక్కోవచ్చు. చెట్టు వయసు ఎక్కువైన కొద్దీ ఖరీదు పెరుగుతుంది. ఖర్చు తగ్గి, ఆత్మతృప్తి కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

* మన చుట్టుపక్కల ఉన్న మొక్కల్లో బోన్సాయ్‌గా మార్చాలనుకున్న దాన్ని మట్టి నుంచి జాగ్రత్తగా బయటకు తీయండి. వేర్ల చివర్లను కత్తిరించండి. రంధ్రాలున్న కుండీలో కొద్దిగా మట్టి నింపి అందులో మొక్కను పెట్టండి. బోన్సాయ్‌కి రాళ్లమట్టి అనుకూలం. అందులో నత్రజని, పొటాషియం, భాస్వరం సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

* పెద్ద వృక్షాల వేళ్లు భూమి లోపలికెళ్లిపోయి అవసరమైన నీటిని గ్రహిస్తాయి. కానీ బోన్సాయ్‌ అందుకు విరుద్ధం కనుక రోజూ తప్పకుండా నీళ్లు పోయాలి. నీళ్లు, ఎరువు కూడా ఎక్కువైనా, తక్కువైనా కష్టమేనని మర్చిపోవద్దు.

* మొక్కను ఎండపొడ తగిలేలా ఉంచాలి. కొమ్మల్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి. మొక్కను నచ్చిన రీతిలో వంచితే అందమైన ఆకృతిలో పెరుగుతుంది. మట్టి మీద అందమైన రంగురాళ్లను అమర్చితే అవి మరింత శోభిస్తాయి. ఏ డెకొరేటివ్‌ పీసులూ వీటికి సాటిరావు కదూ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని