నిద్రపుచ్చే మొక్కలు!
close
Published : 15/07/2021 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిద్రపుచ్చే మొక్కలు!

చాలామంది నిద్ర పట్టడం లేదని వాపోతుంటారు. అలాంటివారు కొన్ని రకాల మొక్కలను పడగ్గదిలో పెట్టుకుని చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.

లుషితమైన గాలి వల్ల జలుబు, రకరకాల అలర్జీలు వస్తాయి. కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల అవి ఆ గాలిని శుభ్రం చేస్తాయి. దీంతో జబ్బులకు దూరంగా ఉండొచ్చు. వాటిని పడక గదిలో పెడితే స్వచ్ఛమైన వాయువులను పీలుస్తూ హాయిగా నిద్రపోవచ్చు.

* లావెండర్‌... ఈ మొక్క వెలువరించే సువాసనలు గదంతా వ్యాపించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. దాంతో చక్కగా నిద్రపడుతుంది. ఈ పూల పరిమళాలు మీలోని ఒత్తిడి, గుండె దడలను తగ్గిసాయి. పడగ్గదిలో సూర్యరశ్మి పడే చోట ఈ మొక్కను పెట్టండి. వెలుతురు పడే అవకాశం లేకపోతే కనీసం ఫ్లోరోసెంట్‌ లైట్‌ను అమర్చండి.

* కలబంద... ఇది రాత్రుళ్లు ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు పరిసరాల్లోని వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది. దాంతో మీకు తెలియకుండానే హాయిగా నిద్ర పడుతుంది.

* జెర్బరా.. ఈ పూల మొక్క ఎక్కడుంటే అందం, ఆకర్షణీయతా అక్కడే. ఇవి గదికి కొత్తందాన్ని ఇస్తాయి. గదిలోని గాలిని శుభ్రం చేసి నిద్రపట్టేలా చూస్తాయి.

* లెమన్‌ బామ్‌... ఔషధ గుణాలున్న మొక్క. దీని ఆకుల నుంచి తీసిన నూనెను మర్దనాకు ఉపయోగిస్తారు. దీని వాసన ఒత్తిడి, ఆందోళనా, డిప్రెషన్‌ లాంటి వాటిని నియంత్రిస్తుంది. ఈ మొక్క ఆకులను నలిపి వాసన చూడండి. హాయిగా అనిపించడమే కాకుండా నిద్రా పడుతుంది.

* మల్లె... ఈ మొక్కను గదిలో కిటికీ దగ్గర చిన్న కుండీలో పెట్టి చూడండి. ఇది ఆందోళనలు, ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. అంతే కాదు హాయిగా నిద్ర పుచ్చుతుంది కూడా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని