మాన్‌సూన్‌లో మొక్కల రక్షణ
close
Published : 18/07/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాన్‌సూన్‌లో మొక్కల రక్షణ

లాక్‌డౌన్‌ తర్వాత చాలామంది వ్యాపకం మొక్కల పెంపకమే అయ్యింది. కొత్తగా మొదలు పెట్టినవారు ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కుండీల కింది భాగంలో ఎక్కువైన నీరు పోయేలా రంధ్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కుండీ అడుగున ఉంచే మూతలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.
* ఈ కాలంలో గాలులూ ఎక్కువే. ఇవి మొక్కలు పడిపోయేలా చేస్తాయి. ప్లాస్టిక్‌ షీట్లను వాటికి అడ్డుగా కట్టాలి.
* బాల్కనీ గార్డెనింగ్‌ ఇప్పుడు సాధారణమైపోయింది. మీరు పెంచే వాటిల్లో తక్కువ నీరు సరిపోయేవి ఉంటే వాటిని అక్కడి నుంచి వర్షం పడని ప్రదేశానికి మార్చండి. ఎండగా ఉన్నప్పుడు కావాలంటే మళ్లీ మార్చుకోవచ్చు.
* వర్షం వెలిసిన తర్వాత కుండీల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయేమో చూసుకుని అవసరమైతే తీసేయాలి. ఈ కాలంలో రోజూ నీళ్లు పోయాలన్న నిబంధనేమీ వద్దు. మొక్క మొదలు తడిగా ఉంటే.. కొన్ని రోజులపాటు నీళ్లు పోయకపోయినా ఫర్లేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని