బొమ్మలతో జాగ్రత్త!
close
Published : 24/07/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొమ్మలతో జాగ్రత్త!

పసిపిల్లలున్న ఇంట్లో... బొమ్మలకు కొదవే ఉండదు. ఏ మూల చూసినా... అవే. అయితే తక్కువ ఖరీదనో, తరచూ అడుగుతున్నారనో ఏవి పడితే అవి కొనిస్తే... వాటితో చిన్నారుల ఆరోగ్యానికీ ముప్పే అంటున్నాయి అధ్యయనాలు. మరేం చేయాలి? అంటారా...

ట్రక్కులు, కార్లు, లైట్లు వెలిగే బొమ్మలు, మాట్లాడే జంతువులు... ఇలా ఎలక్ట్రికల్‌ బొమ్మల్ని కొనేటప్పుడు ‘యూఎల్‌ సీల్‌’ ఉందో లేదో గమనించుకోండి. ఇలా ఉంటే దానిలో ఉపయోగించిన భాగాలు పరీక్షించినవి, భద్రమైనవి అన్నది సూచన. 

* బొమ్మల్ని ఎంచుకునేప్పుడే వాటి నాణ్యతను గమనించుకోవాలి. సాఫ్ట్‌ టాయ్స్‌లో ఉపయోగించే ఫర్‌... ఏమాత్రం నాసిరకంగా ఉన్నా, వాటిని దీర్ఘకాలం వాడుతున్నా అలర్జీలు, శ్వాసకోస వ్యాధులు తప్పకపోవచ్చు. అందుకే ఉతికే అవకాశం ఉన్నవి, శుభ్రమైనవి మాత్రమే ఎంచుకోండి.

* పదునైన చివర్లు ఉన్నవి, చిన్న చిన్నవి కొనకండి. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండొచ్చు. పిల్లల వయసు, ఆసక్తి, సామర్థ్యాన్ని బట్టి  కొంటే సద్వినియోగం అవుతాయి.

* చెక్క బొమ్మలు ఇచ్చేటప్పుడు పెయింట్‌ లేకుండా చూసుకోండి. వాటిని తరచూ నోట్లో పెట్టుకుంటుంటే... అందులోని సీసం పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

* ఆటవస్తువులను కొనేటప్పుడు థాలేట్‌, పీవీసీ, బీపీఏ ఫ్రీ రకాలవి ఎంచుకోండి. రీసైక్లింగ్‌ కోడ్‌ %3, %6, %7 ఉన్న ప్లాస్టిక్‌ బొమ్మల్ని కొనొద్దు. నాన్‌ టాక్సిక్‌ అయిన ఆర్ట్‌మెటీరియల్‌ పెయింట్‌లు, క్రేయాన్లు, మార్కర్లు... వంటివాటిని వాడొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని