ఒత్తిడిని తగ్గించే వర్ణాలు
close
Updated : 13/09/2021 05:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తిడిని తగ్గించే వర్ణాలు

రంగులు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మనసుకు ఊరటనిచ్చి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాంటివాటి లో కొన్నింటి సుగుణాలు తెలుసుకుందామా!

ఆకుపచ్చ... ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతికి అద్దంలాంటిదీ రంగు. ఒత్తిడి, ఆందోళనలు తగ్గించే ఈ వర్ణాన్ని హాలు, వంటగది... ఇలా ఏ గదికైనా వేసుకోవచ్చు.

గులాబీ... అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే వర్ణమిది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఏ గదికైనా ఇట్టే నప్పేస్తుంది. ముఖ్యంగా చిన్నారుల గదులకు బాగుంటుంది.

తెలుపు... ఇది తాజాదనానికి, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంది.  గర్భిణులు ఈ రంగు  గదిని ఎంచుకుంటే వారి మూడ్‌ ఎప్పుడూ హాయిగా ఉంటుంది.

పసుపు... రోజును  ఉత్సాహంగా మొదలుపెట్టాలనుకునేవారు ఈ రంగులో ఉండే వస్తువులను మీ కళ్ల ఎదుట పెట్టుకుంటే మంచిది. ఇదే విషయాన్ని కొన్ని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని