గ్యాస్‌ వృథా చేయొద్దు
close
Updated : 16/09/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాస్‌ వృథా చేయొద్దు

రోజు రోజుకూ గ్యాస్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. పైగా అది చాలా విలువైన సహజ వనరు కూడా. అందుకే వంట గ్యాస్‌ని ఎలా ఆదా చేయాలో చూడండి...

* నీళ్లు మరిగిస్తున్నారా... తాగు నీటి కోసం నీళ్లు మరగబెడుతుంటే... దీనికి స్వస్తి చెప్పి సురక్షిత నీటికోసం వాటర్‌ ఫిల్టర్‌ / ప్యూరిఫయర్‌ వాడండి.

* పాత్రలు పొడిగా... తడి గిన్నెను పొయ్యి మీద పెడితే వేడెక్కడానికి ఎంతో కొంత గ్యాస్‌ వృథా అవుతుంది. ఇలా అయ్యే గ్యాస్‌ను లెక్కేస్తే పెద్ద మొత్తమే తేలుతుంది. కాబట్టి గిన్నెలు పొడిగా ఉండేలా చూసుకోవాలి.

* ఎక్కువ ఉడికించొద్దు... కూరలను  ఎక్కువసేపు ఉడికిస్తే గ్యాస్‌ వృథా. పోషకాలూ ఆవిరవుతాయి. అన్నం వండేప్పుడు సరిపోయేంత నీళ్లే పొయ్యండి. నిర్ణీత సమయంలో పొయ్యి కట్టేయాలి.

* పెద్ద పాత్రలే... బర్నర్‌కి సరిపోయేంత పెద్ద పాత్రలనే వాడాలి. చిన్నవైతే మంట పక్కలకు వెళ్లి గ్యాస్‌ వేస్ట్‌  అవుతుంది.

* అవెన్‌... కూరలు వేడి చేసుకోవడం, స్నాక్స్‌ తయారీ... ఇలా కొన్ని రకాల పనులకు అవెన్‌ను వాడుకోవచ్చు.

* సిద్ధంగా... పదార్థాలన్నీ సిద్ధంచేసి పెట్టుకున్నాకే బర్నర్‌ వెలిగించాలి.

* చిన్నమంటపై... ఇలా చేయడం వల్ల పోషకాలు ఆవిరైపోవు. గ్యాసు వృథా కాదు. పాన్‌ వేడయ్యాక స్టవ్‌ను చిన్నగా చేస్తే సరి.

* లీకులతో జాగ్రత్త.. గ్యాసుపైపు ఎక్కువ రోజులు వాడుతున్నారా? అయితే అది పాడై ఉండొచ్చు. లీకేజీ ప్రమాదమూ ఉంది. నిర్ణీత కాల వ్యవధుల్లో తప్పక పైపు మార్చుకోవాలి.

* మూత పెట్టాలి... ఏది వండినా తప్పనిసరిగా మూత పెట్టాలి. ఇలా చేస్తే ఆవిరి బయటకు వెళ్లదు, కూరలు త్వరగా ఉడుకుతాయి. కుక్కర్‌లో వండితే గ్యాస్‌ ఆదా.

* శుభ్రత... బర్నర్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. నలకలు ఉంటే మంట సరిగా రాదు, గ్యాస్‌ వృథా అవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని