వంటింటి వస్తువులతో ఇంటికి అలంకారం
close
Published : 18/09/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటింటి వస్తువులతో ఇంటికి అలంకారం

ఏది చూసినా వంటింట్లో అవసరమే అనిపిస్తుంది. అలా కొనిపెడుతూ ఉంటే కొత్త, పాతవాటితో అల్మారాలన్నీ నిండిపోతాయి. పోనీ పాతవాటిని తీద్దామా అంటే.. మనసొప్పదు. అయితే వీటినోసారి చూడండి. మీ సమస్యకు పరిష్కారంలా లేవూ! ఫోర్క్‌లు, చెంచాలు, చెక్కగరిటెలు మొదలైనవాటిని ఇలా డిజైన్‌ చేసిన ఫ్రేముల్లో చేరిస్తే చాలు. చక్కగా అలంకరణ వస్తువులై పోతాయి. గరిటెలు చిన్న పూలకుండీల్లా గోడకు పచ్చదనాన్నందిస్తాయి. పెయింటింగ్‌పై ఆసక్తి ఉంటే వాడని చాపింగ్‌ బోర్డు, పాన్‌లే కాన్వాసులవుతాయి. గదుల్లో భిన్నంగా అమరిస్తే ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇంకేం.. మీరూ సృజనకు కాస్త పని చెప్పి ఇంటికి కొత్త అందాన్ని తెచ్చేయండి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని