ఇంటికి ముస్తాబు
close
Published : 22/09/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటికి ముస్తాబు

మనం అందంగా తయారవడమే కాదు, ఇంటినీ చూడచక్కగా ఉంచుకోవాలని చూస్తాం. కానీ ఎన్ని ముస్తాబులు చేసినా, ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దినా కొన్నాళ్లకి ఇంతేనా అనిపిస్తుంది. మరి ఎప్పటికప్పుడు శోభాయమానంగా కనిపించాలంటే?! ఈ చిట్కాలు పాటించి చూడండి...

ఇంటికి రంగులు వేయడం మాటలు కాదు. ఇల్లు మారినంత హంగామా. సామానంతా ప్యాక్‌ చేసి పక్కన పెట్టి వేసిన రంగులు ఆరాక సర్దుకోవాలి. అంత శ్రమ పడలేం అంటే... ఈ సమస్యకు విరుగుడు వార్నిష్‌ను తలపించే వాల్‌పేపర్లు. వీటిని గోడలకు అతికించేస్తే ముచ్చటగా ఉంటాయి.

* కొన్ని ఇళ్లలో పూలూ లతలతో కార్వింగ్‌ చేసిన తలుపులు, కిటికీలు అందంగా కనిపిస్తాయి. కానీ చాలామంది సాదాగా వదిలేస్తారు. అలాంటప్పుడు బోసిగా ఉన్నాయని దిగులుపడే బదులు వాటికి చక్కటి రంగులద్దితే ఆహ్లాదంగా ఉంటుంది.

* ప్రతిసారీ కొత్త కొత్త షో పీస్‌లు, వాల్‌ హ్యాంగింగ్సు కొనడం వల్ల సామాను పెరిగిపోతుంది. అందుకు భిన్నంగా ఉన్న వాటినే స్థల మార్పిడితో అందంగా అమర్చుకోవచ్చు.

* మెట్ల మీద కార్పెట్‌ పరవడం వల్ల రిచ్‌ లుక్‌ వచ్చే మాట నిజం. కానీ అది కాస్త జరిగినా, మడతపడినా పడిపోతాం. కనుక కార్పెట్‌ను తలపించే పెయింట్‌ వేస్తే ఆహా అనిపించడం ఖాయం.

* గోడలు పెయింటింగులు లేదా హ్యాంగింగ్స్‌తో కళాత్మకంగా ఉంటాయి. అవి కిక్కిరిసి ఉంటే మాత్రం గందర గోళంగా అనిపిస్తాయి.

కొందరు యాంటిక్స్‌ సేకరిస్తారు. కేవలం వాటితోనే నింపితే కొన్ని దశాబ్దాలు వెనక్కెళ్లిన భావన కలుగుతుంది. వాటితోబాటు అధునాతన వస్తువులనూ కలిపి అలంకరిస్తే వహ్వా అనిపిస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని