సహోద్యోగులతో సఖ్యంగా....
close
Updated : 22/09/2021 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహోద్యోగులతో సఖ్యంగా....

నచ్చిన మిత్రులను ఎంపిక చేసుకోవచ్చు కానీ... ఆఫీసులో ఉండే సహచరులను అలా ఎంచుకోలేం. అలాగని వారితో సత్సంబంధాలు నెరపలేకపోతే పని వాతావరణం దెబ్బతింటుంది. బృంద స్ఫూర్తి, పనిలో వేగం అన్నీ కుంటుపడతాయి. అలాకాకుండా ఉండాలంటే...

నవ్వుతో మొదలు... మొదట్లో సహచరులతో వెంటనే మాట కలపలేం. వారు ఎదురైనప్పుడు చిన్న నవ్వు నవ్వండి. మాటలు వాటికవే కలిసిపోతాయి. ఈ అలవాటుని ఎన్నాళ్లయినా వదలొద్దు. అవతలి వారు మాట్లాడినా, మాట్లాడకపోయినా చిరునవ్వుతోనే పలకరించండి. క్రమంగా అలవాటు పడతారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. సహచరులతో మీరే మాట్లాడండి. కలిసి లంచ్‌, డిన్నర్‌ చేయండి. ఇవన్నీ స్నేహితులుగా వారు మనకు దగ్గరవడానికి ఉపయోగపడతాయి.

పని పంచుకుందాం... ఎదుటి వారు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు సహాయపడండి. దీని వల్ల వారికి పని సులువవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏదెనా సమస్య వచ్చినప్పుడు వారూ మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఇటువంటి సంఘటనలే మిమ్మల్ని దగ్గరచేస్తాయి.

గౌరవిద్దాం... మీరు ఒకరితో మాట్లాడకపోయినా.. స్నేహపూర్వకంగా మెలగకపోయినా వచ్చే నష్టం తక్కువే. కానీ గౌరవం ఇవ్వకుంటే మాత్రం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అందరితో మర్యాదగా మెలగండి. ఎవరైనా పలకరించినప్పుడు సరిగ్గా స్పందించండి. గాసిప్స్‌ను ప్రచారం చేయొద్దు. ఇతరుల అనుమతి లేకుండా వారి వస్తువులను వినియోగించడం, పొరపాట్లను ఇతరుల మీదికి నెట్టడం వంటివి చేయొద్దు. ఇవి మీపై చెడు అభిప్రాయం కలిగిస్తాయి.

వెనుకాడొద్దు... మీ వల్ల ఎదుటివారికి అసౌకర్యం కలిగినప్పుడు ‘క్షమించండి’ అని, మేలు జరిగినప్పుడు ‘థాంక్స్‌’ అనీ చెప్పండి. ఇలా చెప్పకపోతే ఎదుటి వారి ఇగో దెబ్బతింటుంది. అలాగే ఏదైనా సహాయం కోరినప్పుడు ‘ప్లీజ్‌’ అనటం ఉత్తమం.

వాళ్లను వదిలేద్దాం... కొందరు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. వాళ్లపని వాళ్లు చూసుకుంటారు. అవసరం వస్తేనే స్పందిస్తారు. వారిని మీతో మాట్లాడాలని బలవంతపెట్టొద్దు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు. ఇతరుల దగ్గర ఎప్పుడూ వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు.

వాదనలు వద్దు... రాజకీయ అంశాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు అందరివీ ఒకేలా ఉండవు. వాటి గురించి ఎప్పుడూ వాదించొద్దు. ఇవి క్రమంగా పెరుగుతాయే తప్ప తగ్గవు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని