కష్టపడి పనిచేయడానికి అలవాటు పడండి!
close
Updated : 23/09/2021 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టపడి పనిచేయడానికి అలవాటు పడండి!

అమ్మాయిలు లక్ష్యాలు నిర్దేశించుకునే వరకూ, వాటిని చేరుకునే వరకూ ఉత్సాహంగా ఉంటారు. ఆ తర్వాతే నీరుగారిపోతారు. అలా కాకుండా ఉండాలంటే... ఆశయంతో పాటు ఆలోచన, ప్రణాళిక కూడా ఉండాలి.

ప్రతి ఒక్కరికీ జీవితంలో లక్ష్యం అంటూ ఉండాలి. అవి లెక్కకు మించి కూడా ఉండొచ్చు. వీటిని దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలుగా విభజించుకోవాలి. వాటి సాధనకు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా? ఏం చేస్తున్నా? ఏం చేయాలనుకుంటున్నా? గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి వంటి వాటిపై అవగాహన ఉండాలి. వీటిపై స్పష్టత ఉంటేనే మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి.

* కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు చాలా విషయాలు తెలియవు. కాబట్టి ఒక్కోటీ తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం పని వేళల కంటే కాస్త ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే మీరు తెలుసుకోవాలనుకునే, శోధించాలనుకునే విషయాలపై దృష్టి పెట్టాలి... కష్టపడాలి. అప్పుడే కెరియర్‌లో దూసుకెళతారు.

* కష్టపడి పనిచేసే అలవాటు ముందు నుంచి ఉండాలి. అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేయడానికీ వెనుకడుగు వేయకూడదు. మీకు ఇచ్చిన అంశంలో జరిగే పరిణామాలపై అప్‌డేట్‌గా ఉండాలి. అవసరమైతే సాంకేతికంగా, మరే రకంగానైనా మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. నిత్య విద్యార్థిలా ఉండాలి. నిరంతరం శోధన కొనసాగుతూనే ఉండాలి.

* బృందంలో పనిచేస్తున్నప్పుడు త్వరగా గుర్తింపు రావాలంటే ఇనిషియేషన్ తీసుకోవాలి. ప్రో యాక్టివ్‌గా ఉండాలి. వారికి అవసరమైనప్పుడు వారు అడగకముందే సాయాన్ని అందిస్తే, తక్కువ సమయంలోనే ఆ పని పూర్తిచేస్తే, గుర్తింపు లభిస్తుంది. పై అధికారి చెప్పినప్పుడే నేనీ పని చేస్తాను’ అని కాకుండా బాధ్యతలను తీసుకోవడంలో చొరవ చూపాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని