లక్షల మాస్కులు తయారుచేయించి...
close
Updated : 12/03/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్షల మాస్కులు తయారుచేయించి...

ఆపదలు చెప్పిరావు... అలాంటివి ఎదురైనప్పుడు మానవత్వంతో స్పందించడం ఒకెత్తు. దాన్ని బాధ్యతగా మలుచుకుని అవకాశాల్ని సృష్టించుకోవడం మరో ఎత్తు. అలాంటి పనే చేసింది  ఒడిశాకు చెందిన ఓ మహిళా స్వయం ఉపాధి బృందం.
‘హజీ అలీ ప్రొడ్యూసర్‌ గ్రూపు’ కొవిడ్‌ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో మాస్కుల అవసరాన్ని గుర్తించింది. కాటన్‌ వస్త్రంతో మాస్కులు కుట్టాలనే ఆలోచన చేసింది. తమ పరిధిలో ఉన్న స్వయం సహాయక బృందాలన్నింటినీ ఇందులో పాలుపంచుకునేలా ప్రోత్సహించింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ఓ మెటీరియల్‌ బ్యాంకుని సిద్ధం చేసుకుంది. ఇక్కడ నుంచే వస్త్రం, మెషిన్లు...ఇతరత్రా సామగ్రిని సభ్యుల అవసరం మేరకు ధెన్‌కనాల్‌, బార్గార్‌, భువనేశ్వర్‌, పూరీ, కోరాపుట్‌, ఖుర్దా, భాద్రాక్‌ వంటి ప్రాంతాల్లో అందించేది. వాటిని అందుకున్న స్త్రీలు...తమ పని ప్రారంభించేవారు. మార్కెట్‌ అవసరం దృష్టిలో పెట్టుకుని రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఒక్కో మహిళ రోజుకి 150 మాస్కులను తయారుచేసి సగటున రోజుకి రూ.300 సంపాదించుకునేవారు. క్రమంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. ఇలా తయారుచేసిన వాటిని వివిధ ప్రభుత్వ శాఖలు, ఆసుపత్రులు, పలు స్వచ్ఛందసంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఇనిస్టిట్యూట్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, గార్మెంట్‌ స్టోర్స్‌కు అందించిందీ ప్రొడ్యూసర్‌ గ్రూపు. ఆ రాష్ట్రం ప్రారంభించిన మిషన్‌ శక్తి ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం తీసుకుంది ఈ బృందం ‘అత్యవసర సమయంలో లక్షలాదిమందికి మా మాస్కులు ఉపయోగపడటం, దీనివల్ల వందలాదిమంది మహిళలు తమ కుటుంబాలకు చేయూతగా నిలవడం సంతోషంగా ఉంది’ అంటారు బృందం అధ్యక్షురాలు హలీమా ఖాతున్‌,కార్యదర్శి జాస్మిన్‌ మల్లిక్‌. ఇప్పటివరకూ లక్షకుపైగా మాస్కులను వీరు కుట్టారు. దీనిద్వారా నెలకు రూ.10 లక్షల వరకూ ఆదాయాన్ని అందుకుంటున్నారు. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ స్వయం ఉపాధి సంఘంగా గుర్తించి, నగదు బహుమతితో సత్కరించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని