కల్లోల వేళ..కళాకారులకు ఆసరా
close
Updated : 15/06/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కల్లోల వేళ..కళాకారులకు ఆసరా

కరోనా, లాక్‌డౌన్‌ల వల్ల ఎంతోమంది కళాకారులు ఆదాయం లేక రోడ్డునపడ్డారు. అలాంటి వారిని చూసి చలించిపోయింది ప్రముఖ కథక్‌ నృత్యకారిణి మంజరి చతుర్వేది. తోటి కళాకారులకు సాయమందించాలనుకుంది.
‘మహమ్మద్‌ తాజ్‌ కవాలీ సింగర్‌. కచేరీలతో ఎప్పుడూ బిజీగా ఉండే అతను కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడు కూరగాయలను అమ్ముతున్నాడు. ఒక్కోరోజు పూట గడవడమూ కష్టంగానే ఉంది. ఇతనే కాదు.. ఇలా ఎందరో కళాకారులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధిని కోల్పోయారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తుంది మంజరి. లఖ్‌నవూకు చెందిన ఈమె ప్రఖ్యాత సూఫీ కథక్‌ నృత్యకారిణి. కరోనా కారణంగా రోడ్డునపడ్డ కళాకారులకు గురించి తెలియగానే ఆమె తన ‘సూఫీ కథక్‌ ఫౌండేషన్‌’లోని సభ్యులు, స్నేహితులను సంప్రదించింది. తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టుపెట్టి సాయం చేయమని కోరింది. కళలపై ఆసక్తి ఉన్నవారు విరాళాలను ఇవ్వడం ప్రారంభించారు. అలా రూ.25 లక్షలకు పైగా సేకరించింది. వారి అవసరాలనుబట్టి నెలకు రూ.3000-రూ.5000 వరకూ అందిస్తుంది. అలా యూపీ, దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌లలో 150 కుటుంబాలకు ఆర్థిక సాయం కల్పిస్తోంది. ఆర్థికంగానే కాదు.. మరే ఇతర సాయం కావాల్సినా అందిస్తోంది.
‘కళాకారులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కచేరీలే ఆధారం. వాటితోనే కుటుంబాలు గడిచేది. అలాంటిది కరోనా కారణంగా ఒక్కపూట కూడా తినలేని స్థితికి చేరుకున్నారు. సాయం కోరుతూ వాళ్లు అభ్యర్థించడం మనసుకు కష్టంగా అనిపిస్తోంది’ అంటోంది మంజరి. కేవలం విరాళాలమీదే ఇప్పటి వరకూ సాయమందిస్తున్నారు. వీటి మీదే ఆధారపడటం రానురానూ కష్టమవుతోంది. ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాల కోసమంటూ కొంత పక్కనపెడుతుంది. వాటిని ప్రత్యేక పరిస్థితులుగా పరిగణించి పేద కళాకారులకు ఇవ్వాలని కోరుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని