ఈ ఒలింపిక్స్‌ ప్రత్యేకం!
close
Published : 28/07/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఒలింపిక్స్‌ ప్రత్యేకం!

టోక్యోలో పతకాల వేట సాగుతోంది. ఈ విశ్వ క్రీడాపోటీల్లో పాల్గొనడానికి వయసు అడ్డంకి కాదంటున్నారు కొందరు. మేరీ హన్నాను చూస్తే ఇదే విషయం తెలుస్తుంది..

మేరీ హన్నాది ఆస్ట్రేలియా. ఈక్వెస్ట్రెయిన్‌ విభాగం (గుర్రపు స్వారీ)లో పోటీ పడుతోంది. వయసు 66 ఏళ్లు. ఇప్పటికే 1996, 2000, 2004, 2012, 2016 ఒలింపిక్స్‌లో పాల్గొంది. ఈమె చిన్నప్పుడు వాళ్లకు గుర్రాలుండేవి. వాటిని సరదాగా ఎక్కుతుండేది. అలా మొదలైన ఆసక్తి నెమ్మదిగా పోటీల దాకా తీసుకొచ్చింది.  30వ ఏటనుంచి వెన్నునొప్పి వెంటాడుతున్నా సర్జరీ చేయించుకుని మరీ కొనసాగిస్తోంది. ఒలింపిక్‌ చరిత్రలో అతిపెద్ద వయసు మహిళల్లో ఈమెది రెండో స్థానం. మేరీ.. గత ఏడాది ఈ క్రీడలో 80 శాతం స్కోరు సాధించిన తొలి ఆస్ట్రేలియన్‌ మహిళగా గుర్తింపుతోపాటు టోక్యోకి అర్హతనూ సాధించింది. ఈసారి పతకంతోపాటు భవిష్యత్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడమూ తన కలగా చెబుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని