అక్కడ తనే తొలి మహిళా ఇంజినీర్‌!
close
Published : 19/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ తనే తొలి మహిళా ఇంజినీర్‌!

అత్యంత కష్టమైన రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. అదే మార్గంలో శివానీ మీనా తన కెరియర్‌ను ఎంచుకుంది. తను సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌)లో ఇంజినీర్‌గా చేరింది. తవ్వకాల విభాగంలో తొలి మహిళా ఇంజినీర్‌గా చరిత్రలోకెక్కింది. రాజస్థాన్‌కు చెందిన 24 ఏళ్ల శివానీ మీనా స్ఫూర్తి కథనమిది...

సీసీఎల్‌ చేపడుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక రాజ్రప్పా ప్రాజెక్టులో విధులు చేపట్టే అవకాశాన్ని దక్కించుకున్న శివానీ గంగా పూర్‌లో పుట్టింది. తండ్రి పాలిటెక్నిక్‌ ప్రొఫెసర్‌. తల్లి గృహిణి. భరత్‌పుర్‌లో పదో తరగతి వరకు చదువుకుంది. సోదరుడు కాన్పూర్‌ ఐఐటీలో చేరడంతో, తన నుంచి స్ఫూర్తి పొందిన ఈమె, ఇంజినీరింగ్‌ చదవాలనుకుంది. అదే లక్ష్యంతో కోటాలో శిక్షణ తీసుకుని, ప్రవేశపరీక్ష రాసింది. అనుకున్నట్లుగానే జోధ్‌పుర్‌లోని ఐఐటీలో సీటు సంపాదించుకుంది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకుంది.

కల నిజమై...

గతేడాది డిసెంబరులో పలు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న శివానీకి సీసీఎల్‌ నుంచి ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఆ ఉద్యోగంలో చేరి, మగవారితో సమానంగా పని చేయాలని కలలు కన్నా అంటుంది శివానీ. ‘అక్కడ ఇంటర్వ్యూలో ఎంపిక కావడం, వెంటనే నన్ను తీసుకోవడం అన్నీ చాలా వేగంగా జరిగాయి. ఆ తర్వాతే నాకు తెలిసింది... తవ్వకాల విభాగంలో తొలి మహిళగా నాకు అక్కడ స్థానం దక్కిందని. నా ఆనందానికి అంతులేదు. అంతేకాదు, ఝార్ఖండ్‌లో సీసీఎల్‌ సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక రాజ్రప్పా ప్రాజెక్టులో పనిచేసే అదృష్టం దక్కింది. భారీ యంత్రాల మెయింటెనెన్స్‌ కూడా నా బాధ్యతల్లో ఒకటి. మైన్స్‌లో మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ ఆఫ్‌ హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మెషినరీ (ఎంఆర్‌హెచ్‌ఈఎంఎం) విభాగంలో నేనొక్కదాన్నే మహిళను కావడం గర్వంగా ఉంది. ఈ రంగాన్ని ఎంచుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు అమ్మానాన్న, అన్నయ్య ప్రోత్సాహాన్ని అందించారు. చిన్నప్పటి నుంచి లింగ వివక్ష లేకుండా అమ్మ పెంచడమే ప్రస్తుతం నేనీ రంగంలోకి అడుగుపెట్టి, నా కలను నిజం చేసుకోవడానికి కారణమైంది. లక్ష్యాన్ని సాధించడానికి కృషి ఉంటే చాలు. ఎంతటి కష్టమైనా విజయాన్ని దక్కించుకోవచ్చు’ అని చెబుతున్న శివానీకి కేంద్ర మంత్రులు, ప్రముఖులెందరో అభినందనలు పంపడం విశేషం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని