ప్రయత్నించాలా? మానెయ్యాలా?
close
Updated : 21/07/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రయత్నించాలా? మానెయ్యాలా?

నాలుగేళ్లుగా ఓ అంతర్జాతీయ సంస్థలో పని చేస్తున్నాను. ఇప్పటివరకూ నలుగురి కింద చేశాను. నా పని పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సంస్థలో ఉన్నతస్థాయికి వెళతాననేవారు. కానీ అప్రైజల్స్‌ మాత్రం అంత సంతృప్తిగా ఉండటం లేదు. ప్రమోషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ఈసారి రాకపోతే వచ్చే ఏడాదివరకూ వేచి ఉండే ఓపిక లేదు. ఈ విషయంగా మేనేజర్‌ను ఎలా సంప్రదించాలి? లేక వేరే ఉద్యోగం చూసుకోవాలా? 

- ఓ సోదరి

జ. చాలా తక్కువ సమయంలో ఎక్కువమంది ఉన్నతాధికారులతో పనిచేశారు. కానీ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ మార్పులు చాలా సహజం. అలాగే తరచుగా మారే నాయకత్వం కొంత అవరోధం కూడా. చేసిన పనికి, సాధించిన విజయాలకు గుర్తింపు పొందడం మీ హక్కు. కాబట్టి, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం మంచిదే. కాబట్టి మీ మేనేజర్‌ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా.. పదోన్నతికి ఎంపికవడానికి మీరెలా అర్హులో వివరిస్తూ పాయింట్ల వారీగా పేపర్‌ మీద రాయండి. ఎందుకు మిమ్మల్ని ఎంచుకోవాలి?; మీ పదోన్నతి బృందానికీ, మీకూ ఎలా సాయపడుతుంది?; కొత్త బృందం దేన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది?... వంటి అంశాలుండేలా చూసుకోండి. కీలక పాయింట్లను మాటల్లో చెబుతున్నట్లుగా కాస్త వివరంగా రాయండి. ఆపై బలమైన ప్రారంభ (నామినేట్‌ కావడంపై మీ ఆసక్తి), ముగింపు (చదవడానికి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పడం) వాక్యాలను జోడించాలి. మొత్తం సంతృప్తి కలిగేంతవరకూ మార్పులు చేసుకోండి. బాగుందనిపించాక మీ ఉన్నతాధికారిని కొంత సమయం కావాలని అడిగి, మాట్లాడండి. గుర్తుంచుకోండి.. గత అధికారుల గురించో, తోటివారి గురించో ఫిర్యాదులొద్దు. సానుకూలంగా మాట్లాడండి. మీ ఆసక్తిని తెలియజేయండి. మీ కోరిక నెరవేరొచ్చు. బయట చూసుకునే ముందు చేతిలో ఉన్న దాన్ని గురించి బలంగా ప్రయత్నించడం మంచిది కదా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని