బొమ్మలద్దుకున్న కేకులు..!
close
Updated : 19/02/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొమ్మలద్దుకున్న కేకులు..!

మృదువుగా, తియ్యగా, రుచిగా ఉండే కేకులను చూడగానే చాలామందికి నోరూరుతుంది. సంచిత చేసిన వీటిని చూస్తే దాంతోపాటుగా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టకుండానూ ఉండలేరు. అసోంలో ఫైన్‌ఆర్ట్స్‌లో పీజీ చదివిన సంచిత.. కోల్‌కతాలో యానిమేషన్‌ డిప్లొమా పూర్తిచేసింది. విజువల్‌ ఎఫెక్ట్‌ ఆర్టిస్ట్‌గా ‘లైఫ్‌ ఆఫ్‌ పై’తోపాటు మరెన్నో హాలివుడ్‌ సినిమాలకూ పనిచేసింది. ఆ తర్వాత సినీ రంగాన్ని వదిలేసి ‘సంచిస్‌ అవెనె’ పేరుతో కేకులను ఇలా వినూత్నంగా తయారుచేయడం మొదలుపెట్టింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన పాత్రలన్నీ కేకుల్లో ఒదిగిపోయేలా చేస్తోంది. షోకేస్‌లో సర్దుకునే అందమైన బొమ్మల్లా ఉన్న ఇవి చూడముచ్చటగా భలే ఉన్నాయి కదూ...

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని