ఆరోగ్యానికి ఈ ఐదూ...
close
Updated : 12/03/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్యానికి ఈ ఐదూ...

మనం తీసుకునే ఆహారంలో నిత్యం రెండు రకాల పండ్లు, మూడు రకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే అనారోగ్యాలు దరి చేరవని తేల్చి చెప్పింది ఓ అధ్యయనం. అధిక బరువు నియంత్రణ, జీవక్రియలు సక్రమంగా జరగడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని లక్షమందిపై చేసిన ఈ సర్వే పేర్కొంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్స్‌ ఫ్లాగ్‌షిప్‌ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. ఇందులోని మరిన్ని అంశాలేంటంటే...

ర్వేలో భాగంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి సమస్యలకు దూరంగా ఉన్నవారి ఆహార పద్ధతులు పరిశీలిస్తే.. వారంతా కనీసం మూడు రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, రెండు రకాల తాజా పండ్లు తీసుకోవడాన్ని గుర్తించారు. రోజులో ఒకేసారి కాకుండా తక్కువ మోతాదులో ఆహారాన్ని ఐదుసార్లుగా తీసుకునేవారు మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర, నాలుగు నుంచి ఆరు లీటర్ల నీటిని తాగడం, నిర్ణీత సమయం వ్యాయామం చేసేవారి జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఆకుపచ్చగా...
ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు క్యాబేజీ, చిక్కుడు, లెట్యూస్‌ వంటివన్నీ పోషకాలమయమే. ఆకుకూరల్లోని విటమిన్‌ కె, ఎ, సిలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరొటిన్‌ వంటివన్నీ వ్యాధికారకాలను దగ్గరకు రాకుండా చేస్తాయి. వీటిలోని ఫోలేట్‌ ఎర్రరక్తకణాల తయారీలో ప్రముఖపాత్ర వహిస్తుంది. మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. అలాగే క్యాబేజీ, చిక్కుడు వంటివి జీర్ణశక్తిని మెరుగుపరిచి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువునూ తగ్గిస్తాయి. విటమిన్‌-సి సమృద్ధిగా ఉండే సిట్రస్‌ జాతి పండ్లు పీచుతో ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. చర్మం, ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. హృద్రోగాలను దరిచేరకుండా చేస్తాయి. అందుకే రోజూ ఆహారంలో నారింజ, నిమ్మ, పైనాపిల్‌ లాంటి ఏదైనా రెండు రకాల పండ్లను తినడం అలవరుచుకోవాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని