చిన్నారికీ షవర్‌ క్యాప్‌!
close
Published : 18/03/2021 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారికీ షవర్‌ క్యాప్‌!

నెలల చిన్నారి నుంచి అయిదారేళ్ల పిల్లల వరకు స్నానం చేయించాలంటే అమ్మకు కాస్త కష్టమే. ఎందుకంటే వారు ఓ చోట కుదురుగా ఉండరు కదా. లాల పోసే సమయంలో బుజ్జాయి కళ్లు, నోరు, చెవుల్లోకి షాంపూ, సబ్బునీళ్లు పోతాయేమోనని అమ్మ గాబరా పడుతుంది. అలాంటి చిట్టిపొట్టి చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయీ ‘షవర్‌ క్యాప్‌లు’. కంటికింపైన రంగుల్లో... వివిధ డిజైన్లలో దొరుకుతున్నాయి. తేలికగా ఉండే వీటిని చిన్నారి తలకు పెట్టి సులువుగా నీళ్లు పోసేయొచ్చు.  సబ్బునీళ్లు కళ్లు, చెవుల్లోకి వెళ్లకుండా ఈ క్యాప్‌ అడ్డుకుంటుంది. జుట్టు కత్తిరించేటప్పుడు చిన్న వెంట్రుకలు కళ్లలో పడకుండానూ చేస్తుంది. సిలికాన్‌తో తయారుచేసిన దీన్ని శుభ్రం చేయడం కూడా సులువే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని