నాకు పిల్లలు పుట్టరా ?
close
Updated : 21/03/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు పిల్లలు పుట్టరా ?

నా వయసు 25 ఏళ్లు. వివాహమై మూడేళ్లు అవుతోంది. పెళ్లైన మొదటి ఏడాదిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే పదిరోజులకే అబార్షన్‌ అయ్యింది. ఆ తర్వాత పరీక్షల్లో నాకు థైరాయిడ్‌, పీసీఓఎస్‌ ఉన్నాయని తెలిసింది. అప్పటి నుంచి పీరియడ్స్‌ సరిగా రావడం లేదు. రెండేళ్లుగా మందులు వాడుతున్నా. గర్భాశయంలో అండం తయారు కావడం లేదని చెబుతున్నారు వైద్యులు.  నాకు సంతానం కలగదా?

- ఓ సోదరి

మీరు ‘సంతానం కలగదేమో’నని ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. అయితే అండం తయారీ, విడుదలకు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు తీసుకుంటున్నారని తెలుస్తోంది.  పీసీఓఎస్‌, థైరాయిడ్‌ సమస్యల వల్ల బరువు పెరిగినట్లయితే  ఆరోగ్యకరమైన విధానాల్లో తగ్గండి. ఒక పక్క సంతానం కోసం చికిత్స తీసుకుంటూనే మరోపక్క  మీ బరువులో కనీసం పది శాతమైనా తగ్గేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉంటే.. దాన్ని తగ్గించుకోవడానికి ఇన్సులిన్‌ సెన్సిటైజర్స్‌ వాడాలి. అప్పుడే అండం విడుదలకు ఉన్న కొన్ని అవాంతరాలు తొలగిపోతాయి. అండం ఉత్పత్తికి వాడే మందుల్లో చాలా రకాలుంటాయి. ముందుగా మాత్రలు, అవసరమనుకుంటే ఇంజెక్షన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటి వల్ల కూడా అండం తయారీ, విడుదల కావడం లేదంటే...  గర్భం రాకపోవడానికి మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం హిస్టరోస్కోపీ, ల్యాపరోస్కోపీ చేయించుకోవాలి. అవసర మనుకుంటే ‘ల్యాపరోస్కోపీ ఓవేరియన్‌ డ్రిల్లింగ్‌’ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు జీవనవిధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, డైట్‌లో మార్పులు, బరువు తగ్గేందుకు ప్రయత్నించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి చేస్తే  మంచి ఫలితాలుంటాయి. మీరు అమ్మ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి బాధపడకుండా గైనకాలజిస్ట్‌ను కలవండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని