మొటిమే కదా అనుకోవద్దు..
close
Updated : 27/03/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొటిమే కదా అనుకోవద్దు..

ముఖంపై చిన్న మొటిమ వస్తే చాలు.. కంగారు పడిపోతుంటారు అమ్మాయిలు. రకరకాల క్రీమ్‌లు రాయడం మొదలుపెట్టేస్తారు. కానీ దానికి బదులుగా ఇలా చేసి చూస్తే.. సమస్య చాలా సులువుగా తగ్గుతుంది.
బొప్పాయి చర్మంలోని అధికజిడ్డుని తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసి కాసేపు మర్దన చేయాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
* రెండు చెంచాల నారింజ తొక్కల పొడికి కాస్త ఆలివ్‌ నూనె కలిపి ముఖానికి రాసి మృదువుగా రుద్దండి. ఇలా చేస్తే మొటిమలు తగ్గడమే కాదు చర్మం కొత్తమెరుపుతో కనిపిస్తుంది.
* అరటిపండు తొక్కలో ల్యూటిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది కొత్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. అరటిపండు తొక్కని ముఖంపై వలయాకారంగా పదిహేను నిమిషాలు రుద్దాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే సరి. పచ్చి బంగాళదుంపని ముక్కలుగా కోసి ఆ ముక్కను ముఖంపై వలయాకారంగా పది నిమిషాలు రుద్దాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
* రెండు చెంచాల తేనె, కాసిని పాలూ, చెంచా పెసరపిండి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. దీన్ని పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాదు మచ్చలూ పోతాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని