పది రూపాయలకే భోజనం!
close
Updated : 27/03/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది రూపాయలకే భోజనం!

వరలక్ష్మి ఏడోనెల గర్భిణి... ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఏలేశ్వరం నుంచి కాకినాడ వచ్చింది. బస్సు ఛార్జీల కోసం తెచ్చుకున్న రెండొందలూ అయిపోగా చేతిలో పదిరూపాయలు మిగిలాయి. ఆ డబ్బుకే కడుపు నిండేలా భోజనం వడ్డించారు ‘ఫలహారశాల’ మహిళలు. కాకినాడలోని జీజీహెచ్‌కు వచ్చే వేల మంది పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నారు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌’ మహిళా సభ్యులు...
భయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న జీజీహెచ్‌కు రోజుకు మూడు వేలమందికి పైగా రోగులు వస్తుంటారు. వీళ్లలో ఎక్కువ మంది పేదలే. బయట హోటళ్లలో భోజనం చేస్తే వీళ్ల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అటువంటి వారి కోసం పది రూపాయలకే మంచి భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నారు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌’కు చెందిన పదిమంది మహిళలు. అలాగని వాళ్లంతా డబ్బున్నవాళ్లు అనుకుంటే పొరపాటు. వాళ్లూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. వంటింటికే పరిమితం కాకుండా ఏదొక వ్యాపకం ఉండాలని ఏడాది క్రితం ఈ ట్రస్టులో సభ్యులుగా చేరారు. అక్కడే వంటల తయారీలో శిక్షణ పొందారు. ఆపై సేవా దృక్పథంతో కూడిన వ్యాపారం చేయాలని అనుకున్నారు. అలా స్థానిక జీజీహెచ్‌ ఆసుపత్రి ఎదురుగా ‘ఫలహారశాల’ పేరుతో ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి పదిరూపాయలకే అన్నం వడ్డిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్‌ని నెలకొల్పారు ఈ సంస్థ ఛైర్మన్‌ సత్య. ‘మా దగ్గర నేర్చుకున్న వాళ్లల్లో కొందరు ఇంటివద్దే హోటళ్లు, దుకాణాలు పెట్టుకున్నారు. ఇంకొందరు కరోనా సమయంలో వంటలు వండి నిరాశ్రయుల కడుపునింపారు. ఆ సమయంలో ఎంతోమంది పేదలు ఆకలితో అల్లాడటం చూశాక తమ సేవని కొనసాగించాలని అనుకున్నారు. అలా ఈ తక్కువ ధరకే భోజనం అందించే కార్యక్రమం మొదలయ్యింది’ అంటారు సత్య. ప్రస్తుతం ‘ఫలహార శాల’ రోజుకు 300 నుంచి 500 మందికి భోజనాలు అందిస్తోంది. పదిరూపాయలకు టీకూడా రాదుకదా వీళ్లేం పెడతారులే అనుకుంటే పొరపాటు. రోగులకోసం ప్రత్యేకంగా జావ, మిరియాల చారు వంటి పథ్యం భోజనం దొరుకుతుంది. పెరుగన్నం, పులిహోర, చికెన్‌ బిర్యానీ వంటివి వీళ్లు అందించే మెనూలో ఉంటాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని