చెమట తగ్గడంలేదెలా?
close
Updated : 29/03/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెమట తగ్గడంలేదెలా?

నా వయసు 25. బాహుమూలలు, అరిచేతులు, అరికాళ్లలో చెమట పట్టి విపరీతంగా వాసనొస్తోంది. దీనికి పరిష్కారం చూపించగలరు

- ఓ సోదరి

స్వేదగ్రంథులు కొందరిలో ఎక్కువ చురుగ్గా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కొందరికి అరిచేతులు, తలలో...మరికొందరికి శరీరమంతా చెమట పడుతుంది.
కారణాలు: నెలసరి ఆగిపోయే ముందు, హైపర్‌ థైరాయిడ్‌, అధిక బరువు, కాలేయ, కిడ్నీ, మధుమేహ సమస్యలున్నప్పుడు,  కుంగుబాటుకు మందులు వాడేవారికీ చెమట ఎక్కువగా పడుతుంది.

చికిత్స;  చెమట తగ్గాలంటే రోలాన్స్‌, జెల్‌, లోషన్లను ఉయోగించాలి. పడుకునేటప్పుడు రాసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా వీటిని అదుపులో ఉంచడానికి బొటాక్స్‌ పద్ధతిని వాడతారు. అయితే ఇది ఆరు నెలలే పనిచేస్తుంది. సర్జరీలు, నోటిమాత్రల్నీ కొన్ని సందర్భాల్లో సూచించినా వీటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువ.
జాగ్రత్తలు: గోరువెచ్చని నీటితో రెండుపూటలా స్నానం చేయాలి. శుభ్రమైన కాటన్‌ వస్త్రాలు, సాక్సులు మాత్రమే ధరించాలి. యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బు వాడాలి. పోషకాహారం, యోగా, ధ్యానం తప్పనిసరి.
చిట్కాలు: పడుకునే ముందు  చెమట పట్టే చోట యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ రాసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని