ఈ బొమ్మలు భలేభలే!
close
Published : 05/04/2021 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బొమ్మలు భలేభలే!

రెండేేళ్ల లాస్య ఏ కొత్త బొమ్మ కొన్నా మూడు నాలుగు రోజులే ఆడుతుంది. తర్వాత పక్కన పడేస్తుంది. పిల్లలకు బొమ్మలను ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే... వాటిšపై ఆసక్తిని పెంచుకోవడమే కాదు. సృజననూ అలవరుచుకోగలరంటున్నారు నిపుణులు. వారికెలాంటి ఆట వస్తువులను కొనివ్వాలో సూచిస్తున్నారు. అవేంటంటే...

* సెన్సరీ బ్లాక్స్‌.. ఇవి శబ్దంతోపాటు కాంతినీ పిల్లలు గుర్తించేలా చేస్తాయి. రెండు అంశాలను ఒకేసారి గ్రహించే లక్షణాన్ని అలవరుస్తాయి. రకరకాల రంగుల్లో కనువిందు చేసే వీటిని పిల్లలూ ఇష్టపడతారు.

 * టచ్‌ అండ్‌ ఫీల్‌ మ్యాట్‌.. ఇది కూర్చోవడానికి మాత్రమే కాదు, దీన్ని ముట్టుకుంటే తేలికైన వైబ్రేషన్స్‌ వస్తాయి. అది వారిలో ఉత్సాహాన్నీ నింపుతుంది. ఆడుకోవడానికి కూర్చోవాలంటే దాన్ని వాడటం మరిచిపోరు.  పక్కన పెట్టేయరు.

* టెంట్స్‌.. మీ చిన్నారికో చిన్న టెంట్‌ కొనివ్వండి. వారికి నచ్చినప్పుడు అందులో కొంత సేపు గడపడానికి అవకాశాన్నీ ఇవ్వండి. ఇది వారికి స్వతంత్రంగా జీవించడాన్ని, మోటార్‌ స్కిల్స్‌నీ నేర్పుతుందని నిపుణులు చెబుతున్నారు..  

 * ఉడెన్‌ పజిల్స్‌.. పట్టుకోవడానికి మృదువుగా ఉంటాయివి. వీటిపై ఉండే రంగులన్నింటినీ ఒక చోటకు తీసుకురావడాన్ని ఓ పోటీగా చిన్నారులకు అలవరిస్తే చాలు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించే లక్షణం అలవడుతుంది. దీంతో రోజుకొకసారైనా ఆడటానికి ఆసక్తి చూపుతారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని