బుజ్జాయిల కళ్లు.. భద్రమిలా...
close
Published : 16/04/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుజ్జాయిల కళ్లు.. భద్రమిలా...

కరోనా పెద్దవారితోపాటు పిల్లలపైనా విపరీతమైన ప్రభావం చూపింది. ఊసుపోక టీవీ, మొబైల్‌పై ఆధారపడటం, తరగతులూ ఆన్‌లైన్‌ కావడంతో వీరికి కళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 10 శాతం ప్రీస్కూల్‌ విద్యార్థులకు దృష్టి సంబంధిత సమస్యలున్నాయి. కాబట్టి, తినే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారి కళ్లను సురక్షితం చేయొచ్చు.

కంటిచూపునకు సమతుల ఆహారం ప్రధానం. విటమిన్‌ ఎ, సి ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటితోపాటు జింక్‌, ల్యూటిన్‌, జిక్సాంథిన్‌ ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిస్తే చిన్నారులను దృష్టిలోపాలకు దూరంగా ఉంచవచ్చు.
* క్యారెట్‌, ఆకుకూరల్లో విటమిన్‌ ఎ ఎక్కువ. బ్రకలీ, పాలకూర, ఆవకూర, లివర్‌, పాలు, గుడ్లు, చీజ్‌, చిలగడ దుంపల ద్వారా కూడా దీన్ని అందించొచ్చు.
* నిమ్మ, నారింజ, బత్తాయితోపాటు బెర్రీస్‌, టొమాటో క్యాబేజ్‌, క్యాలిఫ్లవర్‌ల ద్వారా విటమిన్‌ సిని అందజేయొచ్చు.
* ల్యూటిన్‌, జిక్సాంథిన్‌.. బఠాణీ, గుమ్మడికాయ, మొక్కజొన్న, దోస, బీన్స్‌ల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్‌ కోసం చికెన్‌, సీ ఫుడ్‌, సోయాబీన్స్‌, పల్లీలు వంటివి ఆహారంలో చేర్చాలి.
* వంటనూనెల్లో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. పాలు, నెయ్యి, మాంసం, గోధుమ, తృణ ధాన్యాలు వంటివాటికి రోజువారీ ఆహారంలో ప్రాధాన్యమివ్వాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని