ముందుగానే సిద్ధం చేయండి!
close
Published : 26/04/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముందుగానే సిద్ధం చేయండి!

పిల్లలకు మూడేళ్లు రాగానే.. ‘మావాడిని స్కూల్లో వేసేయాలండీ’ అన్న మాట వింటుంటాం. కానీ దీనికీ ముందస్తు సన్నద్ధత కావాలి. ఎలాగంటారా? చదివేయండి.

* కథలను చదివి వినిపించండి. పుస్తకాలనే ఇందుకు ఉపయోగించండి. పుస్తకంతోపాటు వినడాన్నీ అలవాటు చేసినట్లవుతుంది. స్కూల్లో ఎలాగూ అలవాటవుతుందన్న భావన వద్దు. ఈ విధానం ఏకాగ్రతనూ పెంచుతుంది.
* చిన్న చిన్న పనులు చెప్పి చేయించండి. తప్పులు చేస్తే జాగ్రత్తలు చెప్పండి. ఇవన్నీ వారికి బాధ్యతను పెంచుతాయి.
* పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించండి. ప్రస్తుత పరిస్థితిలో ఇంటికే పరిమితమైనప్పటికీ వీడియో కాల్స్‌ ద్వారా అయినా మీ స్నేహితుల పిల్లలతో మాట కల్పించండి. బయట ఎపుడైనా కనిపించినా.. పలకరించడం వంటివి చేయించండి. ఏదైనా ఇచ్చినా వారితోనే ఇప్పించండి. కొత్తవారితో కలవడం, పంచుకోవడం అలవాటవుతాయి.
* చిన్నపిల్లలతో బుజ్జిగా మాట్లాడుతుంటాం కదా! స్కూలు ఆలోచన ప్రారంభం కాగానే ఆ భాషను మార్చి మామూలుగా సంభాషణ జరపాలి. సీరియస్‌గా ఉండమని కాదు కానీ.. సరైన భాషలోకి తీసుకు రావడం లక్ష్యం.
* కొన్ని విషయాల్లో అప్పుడప్పుడూ నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వండి. ఉదాహరణకు- వేసుకునే బట్టలు, ఆటలు, స్నాక్స్‌.. ఇలా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని