వారిపై ఓ కన్నేయండి..
close
Published : 02/05/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపై ఓ కన్నేయండి..

కరోనా వల్ల ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ ఆటవిడుపు అంతర్జాలమే. ఆ సమయంలో చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు మానసిక నిపుణులు.
కొంతమంది తమ పిల్లలు వేగంగా అంతర్జాలాన్ని వినియోగించడం చూసి మురిసిపోతుంటారు. వాళ్లు ఏ విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు? ఏం చూస్తున్నారు? అన్నవి గమనించకపోతే మాత్రం ఇబ్బందే. అంతర్జాలంలో విజ్ఞానం, వినోదంతో పాటు అశ్లీలత, నేర సంబంధిత విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి వైపు మనసు మళ్లితే చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే.
* పనికి అడ్డం పడుతున్నారనో, పేచీలు పెడుతున్నారనో ట్యాబ్‌లు, ఫోన్లు చేతికి ఇచ్చి వారిని ఒంటరిగా వదలొద్దు. కొన్ని సైట్లపై స్వీయ నియంత్రణ విధించడం తప్పనిసరి. అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉన్న వాటిని మీ కంప్యూటర్‌లో/ మొబైల్‌ తెరుచుకోకుండా సెట్టింగ్స్‌ ఏర్పాటు చేయండి. చదువుకుంటాం, తెలుసుకుంటాం అంటే మీరూ సాయం చేస్తానని వారికి అవసరమైనవి అందించండి. దీనివల్ల పరిస్థితిలో కొంత మార్పు రావొచ్చు.
* ప్రీటీనేజీ, టీనేజీ పిల్లలు వర్చువల్‌ ఇమేజ్‌కోసం సామాజిక మాధ్యమాల మీద అతిగా ఆధార పడుతుంటారు. ఇది పరిధులు దాటి తెలియని వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ విషయాలు పంచుకోవడం, వ్యక్తిగత చిత్రాలు పంపించడం వంటి వాటి వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీలైనంత వరకూ ఈ సమయాన్ని తగ్గించడానికి వారికి కొన్ని అభిరుచుల్ని పరిచయం చేయండి. ఇంటి పనుల్లో సాయానికి పిలవడం, పుస్తకాలు చదవడం, ఇండోర్‌ గేమ్స్‌ వంటివి అలవాటు చేయండి. క్రమంగా వారు అంతర్జాలంపై ఆధారపడే సమయాన్ని తగ్గించాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని