శానిటైజర్‌ అతిగా వాడుతున్నారా?
close
Published : 02/05/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శానిటైజర్‌ అతిగా వాడుతున్నారా?

కరోనా భయంతో మొదలైందీ శానిటైజర్‌ వాడకం. అయితే దీన్ని ఎప్పుడు వాడాలి. అతిగా వాడితే ప్రమాదమా? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి..
శానిటైజర్‌ అతిగా వాడటం వల్ల చేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చెడు బ్యాక్టీరియా శానిటైజర్‌కు అలవాటు పడి, వృద్ధి చెందుతుంది. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడితే ఏ ఇబ్బందులూ ఉండవు.
* సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్‌ ఉపయోగించకండి. అవి లేకపోతేనే దీని అవసరం ఉందని గుర్తించండి. సబ్బుతో 20 సెకన్ల పాటు రుద్దితే క్రిముల్ని తరిమికొట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. భయంతో అస్తమానం రాసుకోవడం వల్ల అదొక వ్యసనంలా మారుతుంది.
* చేతులకు విపరీతమైన దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్‌ రాసుకున్నా ఫలితం ఉండదు. అవి క్రిముల్ని చంపలేవు సరికదా ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తుంది.  కాబట్టి నీళ్లు అందుబాటులో లేనప్పుడు, రద్దీ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాత్రమే శానిటైజర్‌ ఉపయోగించండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని