నఖ సౌందర్యానికి నువ్వుల నూనె
close
Published : 03/05/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నఖ సౌందర్యానికి నువ్వుల నూనె

అందంగా కనిపించాలని చర్మం, జుట్టుపై చూపించే శ్రద్ధ గోళ్లపైనా చూపించండి. తగిన పోషకాహారం తీసుకుంటూనే ఈ జాగ్రత్తలూ పాటిస్తే మేలు..

* తరచూ గోళ్లు విరిగిపోతుంటే.. ఆముదం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు గోళ్లకు రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా రోజుకి ఒకసారైనా చేస్తుంటే విరిగిపోకుండా ఉంటాయి.
* కొబ్బరి నూనె వేడిచేసి దానికి రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమంలో కనీసం పది నిమిషాలైనా గోళ్లను నాననిచ్చి ఆపై మృదువుగా మర్దన చేయాలి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటిస్తుంటే వాటికి రక్తప్రసరణ అందుతుంది. పెళుసుబారే సమస్య తగ్గుతుంది.
* మూడు చెంచాల నువ్వులనూనెలో చెంచా నిమ్మరసం కలిపి అవెన్‌లో వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పదినిమిషాల పాటు వేళ్లని అందులో ఉంచాలి. చివరగా ఓ రెండు మూడు నిమిషాలు మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.


ఈ కాలంలో తాగే నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. అలానే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, మెంథాల్‌...ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చూస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని