ఓపికతో మార్చుకోండి...!
close
Published : 03/05/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓపికతో మార్చుకోండి...!

పిల్లలు అల్లరిని నియంత్రించలేక కొట్టడం, తిట్టడం చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. కరోనా కాలంలో... ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. అదే పనిగా దండిస్తే...అసలుకే మోసం వస్తుంది. అలాకాకుండా వారు మాట వినాలంటే పెద్దలుగా మీరు మరింత శ్రద్ధ చూపించాలి.

* ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. సరదా కోసం ప్రయత్నించి సమస్యలు తెస్తారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. వారి అసంతృప్తిని అర్థం చేసుకోండి. కాస్త దగ్గరుండి...ఓపికగా వారి ఆలోచనల్ని తెలుసుకోండి. వారి మాట ఊ కొడుతూనే మీరు పట్టు తెచ్చుకోండి. అప్పుడే మాట వింటారు.
* చిన్నారులపై మీ అభిప్రాయాల్నీ, ఇష్టాయిష్టాల్నీ బలవంతంగా రుద్దొద్దు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని చెప్పే అవకాశం కల్పించండి. అలానే చిన్నప్పటి నుంచీ మంచీ చెడుల్ని, కష్టసుఖాల్నీ అర్థం చేసుకునే అలవాటుని నేర్పండి. తమ పనులు తామే చేసుకునేలా చేయండి. క్రమంగా ఇవన్నీ తమ దినచర్యలో భాగం అనుకుంటారే తప్ప భారం అనుకోరు.  
* మనసులో ఉన్న బాధ, కోపాన్ని ఏదోరకంగా మాటల్లో చెప్పగలిగే పిల్లల్లో మొండితనం, కోపం తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎప్పుడైనా పిల్లలు మొండికేస్తుంటే బలవంతంగా వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూడకండి. వారి సమస్యను అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా తనలానే ప్రవర్తించే వారుంటే ముందు వారిలో మార్పు రావాలి. ఆపై వారిని చూసి...పిల్లలు అనుసరిస్తారు. వారిలోనూ ఒత్తిడి ఉంటుందని గ్రహించండి. తగిన పోషకాహారం ఇవ్వడం, వ్యాయామం చేయించడం వంటివన్నీ చేస్తే సమస్య అదుపులోకి వస్తుంది. వీటితోపాటూ అమ్మగా మీరు లాలించడం మరిచిపోవద్దు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని