జంక్‌ ఫుడ్‌ ఇస్తున్నారా?
close
Published : 05/05/2021 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జంక్‌ ఫుడ్‌ ఇస్తున్నారా?

పిల్లలను సంతోషపెట్టాలనో, మారాం చేస్తున్నారనో జంక్‌ ఫుడ్‌కు ఓకే చెప్పేస్తుంటారు. ఇప్పుడు కరోనా వల్ల ఇంటికే పరిమితమైన వాళ్ల గోలని భరించలేక కొనడమో, వండి పెట్టడమో చేసేస్తున్నారు. ఇది అలవాటుగా మారితే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వారంలో మూడు రోజులు, అంతకు మించి ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకుంటే ఆస్తమా, ఎగ్జీమా, రైనిటిస్‌ వంటి సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే కెలొరీలు, కొవ్వు, చక్కెరలు, కార్బోహైడ్రేట్లు సాధారణ ఆహారంపై అనాసక్తిని కలిగిస్తాయి. మల బద్ధకమూ వస్తుంది.
* చిన్నప్పటి నుంచే అలవాటు పడితే తర్వాత ఆరోగ్యకరమైనవి తినడానికి ఇష్టపడరు. వీటిలో రుచి కోసం ఉపయోగించే ప్రత్యేక పదార్థాలు సాధారణంగా తినే వాటి కంటే చాలావరకూ భిన్నంగా ఉంటాయి. ఇవి రోజువారీ ఆహారంపై అయిష్టాన్ని ఏర్పరిచే ప్రమాదముంది.
* చదువుపైనా ప్రభావం పడుతుంది. వీటిలో ఉండే అత్యధిక మోతాదులో ఉండే చక్కెరలు మెదడుపై ప్రభావం చూపుతాయి. బ్లడ్‌షుగర్‌లో ఏర్పడే హెచ్చుతగ్గులు ఏకాగ్రతను దెబ్బతీయడం, బద్ధకం, మానసిక మార్పులకూ కారణమవుతాయి.
* పోషకాలు అందక ఒంట్లో తగినంత శక్తీ ఉండదు. కూల్‌డ్రింక్‌లు నిద్రలేమికీ దారితీస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని