ఇంట్లో గొడవలతో చిరాకొస్తోంది
close
Published : 23/06/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లో గొడవలతో చిరాకొస్తోంది

ఇంటర్‌ చదువుతున్నాను. నాన్న ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అమ్మానాన్నా మాటిమాటికీ గొడవ పడుతున్నారు. నాన్న అన్నింటికీ అమ్మను విమర్శిస్తుంటే బాధగా ఉంది. మనసు పెట్టి చదవలేకపోతున్నాను. పరిస్థితి మెరుగవ్వాలంటే ఏం చేయాలి?

- మానస, హైదరాబాద్‌

ఇంతకుముందు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ దూరదూరంగా ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరు అంతగా పట్టించుకునేవాళ్లు కాదు. ఇప్పుడు రోజంతా కలిసుండటంవల్ల ఒకళ్ల పని ఒకళ్లకి నచ్చనందున ఇలా జరుగుతోంది. నాన్న అమ్మ చేసే ప్రతి పనినీ చూస్తూ ఏదైనా నచ్చకో, శబ్దాల వల్ల ఆఫీసు పనికి ఇబ్బంది కలిగో కోపం చూపిస్తుండవచ్చు. అందరికీ అన్నీ అమర్చుతూ పనులు తెమలకో, అలసటతోనో అమ్మకి చిరాకు ఎక్కువై ఉండొచ్చు. అలా వాళ్లు పిల్లల్ని అనలేక ఒకర్నొకరు తప్పుపట్టడం, గొడవపడటం జరుగుతోంది. మొదట్నుంచీ గొడవలుంటే అవిప్పుడు తీవ్రమై ఉండొచ్చు. గమనించాల్సింది ఏమంటే నువ్వు పుట్టకముందు కూడా వాళ్లకేవో సమస్యలుండొచ్చు. వాటిని సమర్థించుకుంటూ ఇన్నేళ్లూ కలిసున్నారు. కనుక వాళ్ల విషయం, నాకు సంబంధించింది కాదనుకుని దూరంగా వెళ్లు. నీ బాధ్యత చదువు. ఇంటర్‌ కీలకం కనుక చదువుమీదే ధ్యాసపెట్టు. మంచి మార్కులు రావాలనే ధ్యేయం పెట్టుకో. నాన్నెందుకు విసుక్కుంటున్నదీ గమనించి, అమ్మతో చర్చించు. పరిస్థితిలో మార్పు వచ్చేలా చూడు. అమ్మమీద జాలి చూపనవసరంలేదు. తన సమస్యను తాను పరిష్కరించుకోగలదు. కుటుంబ సమస్యలతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నానని వాళ్లు అర్థం చేసుకునేలా విడివిడిగా మెల్లగా, విశదంగా చెప్పు. వీలైతే గొడవపడే అవకాశం రాకుండా చూడు. కానీ నీ ధ్యాసంతా చదువుమీదే ఉండాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని