బీరువా వాసన!
close
Published : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీరువా వాసన!

ఈ కాలంలో దుస్తులు త్వరగా ఆరవు. ఎండ తగ్గి, గాలి చేరక... గదులూ ఓ రకమైన వాసనతో ఉంటాయి. ఇక బీరువాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటప్పుడు...

వైట్‌ వెనిగర్‌ గదుల్లో స్ప్రేచేస్తే దుర్వాసన ఉండదు.

* బ్యాగులు కొన్నప్పుడు ఇచ్చే సిలికా జెల్‌ సాచెట్లను బీరువాల్లో పెడితే... వాసనల్ని పీల్చేసుకుంటాయి. సిల్వర్‌ ఫిష్‌ల సమస్యా రాదు.

* దుస్తులు సరిగా ఆరనప్పుడు... డ్రైయర్‌తో ఓ సారి ఆరబెట్టండి. అప్పటికీ తేమ పోకపోతే... ఫ్యాను గాలికైనా పూర్తిగా ఆరాక నాఫ్తలిన్‌ గోళీలను ఉంచండి. ఆ వాసన పడని వారు.. కాస్త వంటసోడాను చిన్న వస్త్రంలో మూటకట్టి దుస్తుల మధ్య ఉంచితే సరి.

* నిమ్మగడ్డి, కాస్త రోజ్‌ వాటర్‌ నీళ్లల్లో వేసి మరిగించండి. ఆ సువాసనలు గదులంతా వ్యాపిస్తాయి. తేమతో వచ్చే ముక్కవాసన రాదు.

* బూట్లని అరల్లో దాచి పెట్టేటప్పుడు పాత కాగితాలని ఉండల్లా చుట్టి.. వాటిలో కుక్కితే చెడు వాసన రాదు.

* బట్టలు దాచిపెట్టే బీరువాల్లో, చెప్పుల్లో నాలుగైదు సుద్దముక్కలు వేసి ఉంచితే అవి తేమను పీల్చుకుని బట్టలు ముక్కవాసన రాకుండా చూస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని